గ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నిర్మించనున్న గూగుల్

Google announces Rs 113-cr grant for 80 oxygen plants. కరోనా మహమ్మారిపై పోరాడడానికి పలు సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  17 Jun 2021 4:48 PM IST
గ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నిర్మించనున్న గూగుల్

కరోనా మహమ్మారిపై పోరాడడానికి పలు సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. గూగుల్ సంస్థ కరోనాపై పోరులో భారతదేశానికి మద్దతుగా నిలిచింది. రూ.113 కోట్లు (15.5మిలియన్ల డాలర్లు ) అందిస్తామని గూగుల్ సంస్థ గూగుల్.ఆర్గ్ గురువారం ప్రకటించింది. హెల్త్‌ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది.

ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్లను దేశంలోని గ్రామాల్లో నిర్మించనున్నాయి. కొన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ఇతర అధికారులతో కలిసి ఈ ప్రోగ్రామ్ లో గూగుల్ పని చేస్తుంది. అపోలో మెడీ స్కిల్స్‌ ఇనిషియేటివ్తో కలిసి, 20వేల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇప్పించనున్నారు. ఆశా, ఎఎన్‌ఎం వర్కర్ల శిక్షణా నిమిత్తం ఏకంగా రూ. 3.6 కోట్లు (5 లక్షల డాలర్లు) గ్రాంట్‌ను అందివ్వనుంది. భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. ఆక్సిజన్‌ ప్లాంట్లనిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టిపెట్టామని ట్వీట్‌ చేశారు.


Next Story