పెరుగుతూ వెళుతూ.. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న క‌రోనా

Global Covid caseload tops 330.2 million. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి ప్రభంజనం కారణంగా కరోనా

By Medi Samrat  Published on  18 Jan 2022 3:19 PM IST
పెరుగుతూ వెళుతూ.. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న క‌రోనా

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి ప్రభంజనం కారణంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 330.2 మిలియన్లకు చేరుకుంది. కరోనా కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 5.54 మిలియన్లకు పైగా కాగా.. టీకాల సంఖ్య 9.64 బిలియన్లకు చేరుకున్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. మంగళవారం ఉదయం ఇందుకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లో భాగంగా.. యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSSE) ప్రస్తుత గ్లోబల్ కేస్ లోడ్, మరణాల సంఖ్య వరుసగా 330,275,734 కాగా 5,544,688గా ఉందని వెల్లడించింది, మొత్తం వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 9,649,807,641కి పెరిగింది.

CSSE ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా 66,375,579 కేసులు.. 851,451 మరణాలతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కరోనా కారణంగా అత్యంత దెబ్బతిన్న దేశంగా కొనసాగుతోంది. కేసుల పరంగా రెండవ స్థానంలో భారతదేశం (37,122,164 ఇన్‌ఫెక్షన్లు, 486,066 మరణాలు), బ్రెజిల్ (23,015,128 ఇన్‌ఫెక్షన్లు, 621,327 మరణాలు) మూడవ స్థానంలో నిలిచాయి. 5 మిలియన్లకు పైగా కేసులు నమోదవుతున్న ఇతర దేశాలు UK (15,316,457), ఫ్రాన్స్ (14,283,514), రష్యా (10,621,410), టర్కీ (10,459,094),ఇటలీ (8,706,915), స్పెయిన్ (8,093,036), జర్మనీ (7,991,373), అర్జెంటీనా (7,094,865) ఇరాన్ (6,218,741) కొలంబియా (5,543,796) ఉన్నాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSSE) తెలిపింది.

100,000 కంటే ఎక్కువ మంది మరణించిన దేశాలలో రష్యా (314,838), మెక్సికో (301,334), పెరూ (203,376), UK (152,483), ఇండోనేషియా (144,167), ఇటలీ (141,104)), ఇరాన్ (132,04), కోలంబియా 130,996), ఫ్రాన్స్ (127,957), అర్జెంటీనా (118,040), జర్మనీ (115,624), ఉక్రెయిన్ (104,663), పోలాండ్ (102,305) ఉన్నాయి.


Next Story