లండన్ వీధుల్లో టెన్షన్ పెట్టిన బుడగలు

Giant Christmas Baubles Create Chaos On London Streets. సెంట్రల్ లండన్ వీధుల్లో కార్ల కంటే పెద్ద సైజులో ఉన్న రెండు పెద్ద క్రిస్మస్ బబుల్స్ అందరినీ టెన్షన్ పెట్టాయి.

By Medi Samrat
Published on : 2 Nov 2022 5:54 PM IST

లండన్ వీధుల్లో టెన్షన్ పెట్టిన బుడగలు

సెంట్రల్ లండన్ వీధుల్లో కార్ల కంటే పెద్ద సైజులో ఉన్న రెండు పెద్ద క్రిస్మస్ బబుల్స్ అందరినీ టెన్షన్ పెట్టాయి. అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫుటేజ్‌లో టోటెన్‌హామ్ కోర్ట్ రోడ్‌లోని భారీ క్రిస్మస్ అలంకరణ కోసం వీటిని తీసుకుని వచ్చారు. ప్రసిద్ధ షాపింగ్ స్ట్రీట్ లో భాగంగా ఉంచిన ఈ బుడగలు.. గాలికి రోడ్డు మీదకు వచ్చాయి. ఏమి జరుగుతోందా అనే టెన్షన్ కొందరిలో.. ఏమైపోతామా అనే భయం మరికొందరిలో కనిపించింది. భారీ బబుల్.. ఒక స్తంభానికి తగిలి వెళ్లిపోవడం వీడియోలో చూపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత, మరో బంతి కూడా గాలిలో ఎగురుతూ వెళ్ళింది. వీడియోలో, కార్లు అదుపు తప్పడం కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా వాటి నుండి తప్పించుకోడానికి ప్రయత్నించారు. నవంబర్‌లో UKలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.


Next Story