చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తిని వెంటాడిన మొసలి

Giant Alligator Chases Florida Man During Tarpon Fishing. చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తిని మొసలి వెంటబడిన వీడియో చూస్తే

By Medi Samrat  Published on  15 May 2021 10:57 AM GMT
చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తిని వెంటాడిన మొసలి

చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తిని మొసలి వెంటబడిన వీడియో చూస్తే ప్రతి ఒక్కరి గుండెలు అదిరిపోతాయి. 22 సంవత్సరాల యువకుడు చేపలు పట్టడానికి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఓ కొలను దగ్గరకు వెళ్ళాడు. చేపలు పట్టాక వెనక్కు వెళ్లిపోతున్న సమయంలో నీటిలో ఏదో కదలడం మొదలైంది. ఏమిటా అని గమనిస్తూ అతడు చూస్తూ ఉండగా.. నీటిలో నుండి ఓ మొసలి బయటకు వచ్చింది. అలా అతడు కొద్ది దూరం వెళ్ళాక వెనక్కు తిరిగి చూడగా ఆ మొసలి కూడా అతడిని వెంబడిస్తూ కనిపించింది. ఈ ఘటనతో అతడు షాక్ అయ్యాడు. ఎలాగోలా కొద్ది సేపటికి ఆ మొసలి తిరిగి కొలనులోకి వెళ్ళిపోయింది. ఈ వీడియో మొత్తాన్ని అతడు రికార్డు కూడా చేశాడు. సోషల్ మీడియాలో వీడియోను అప్లోడ్ చేశాడు. టామీ లీ అనే వ్యక్తి మొసలి బారి నుండి ఇలా తప్పించుకున్నాడు.

మొసలిని చూడగానే టెన్షన్ పడ్డ టామీ లీ వెనుకకు నడుచుకుంటూ వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతడు కింద కూడా పడడంతో మొసలి మరింత వేగంగా అతడి వైపు వచ్చింది. అలా కొంచెం దూరం వరకూ వెళ్లిపోగలిగాడు. వెనక్కు తిరిగి చూసేసరికి ఆ మొసలి వెళ్ళిపోయింది. మే 8న దక్షిణ ఫ్లోరిడాలోని ఎవర్ గ్లేడ్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టామీ లీ తలకు అమర్చిన గో ప్రో కెమెరాలో ఈ వీడియో మొత్తం రికార్డు అయింది. ఒకానొక సమయంలో మొసలికి.. సదరు వ్యక్తికి మధ్య దూరం జస్ట్ 10 అడుగులేనట..! లీ అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.


Next Story