భారత్ కు ఉరటనిచ్చిన జర్మనీ.. ఎంట్రీ ఇచ్చేస్తూ..

Germany Lifts Ban On Travellers From India. భారత్‌లో కరోనా సెకండ్ తగ్గుముఖం పడుతోంది. భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో

By Medi Samrat  Published on  6 July 2021 2:00 PM IST
భారత్ కు ఉరటనిచ్చిన జర్మనీ.. ఎంట్రీ ఇచ్చేస్తూ..

భారత్‌లో కరోనా సెకండ్ తగ్గుముఖం పడుతోంది. భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో భారత్ నుండి వెళ్లే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తరుణంలో జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించనుంది. ఇందుకు సంబంధించి జర్మనీ ప్రభుత్వ ఏజెన్సీ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రటన్‌లను హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా వర్గీకరించామని తెలుపుతూ సోమవారం వెల్లడించింది.

కొత్త మార్పుల కారణంగా విదేశీ ప్రయాణికులు జర్మనీకి వచ్చేందుకు పెద్దగా ఆంక్షలు ఉండకపోవచ్చు. ఇటీవలి కాలంలో పలు దేశాలు భారత్ ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉండగా.. ఆ లిస్టు లోకి జర్మనీ కూడా చేరింది. వారం క్రితం దుబాయ్ ప్రభుత్వం కూడా భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. భారత్ లో కరోనా కట్టడి అవుతూ ఉండడం.. వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతూ ఉండడంతో ఎటువంటి లక్షణాలు లేని వారిని, వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయులను ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు.


Next Story