సాధారణంగా గొర్రెలు, మేకలను పెంచే వారు కుక్కలను కూడా పెంచుతూ ఉంటారు. ఈ గొర్రెల మందలకు రక్షణగా ఈ కుక్కలు తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రూర మృగాల నుండి కాపాడుతూ ఉంటాయి. జార్జియాలో ఓ కుక్క ఏకంగా 8 తోడేళ్లను చంపి.. తాను కాపలాగా ఉన్న గొర్రెల మందను కాపాడింది. జార్జియాకు చెందిన కుక్క, తాను కాపలాగా ఉన్న గొర్రెలు, మేకల మందపై దాడి చేయడానికి కొట్టడానికి ప్రయత్నించిన ఎనిమిది తోడేళ్లను చంపిన తర్వాత గాయాలపాలైంది.
WAGA-TV నివేదిక ప్రకారం, కాస్పర్ అనే కుక్క, జార్జియాలోని జాన్ వైర్‌విల్లర్ పొలంలో ఉంటోంది. 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం నిమిది తోడేళ్లను అడ్డుకుంది. తోడేళ్ళ దాడి నుండి బయటపడిన తర్వాత కాస్పర్ ఎక్కడికో వెళ్లిపోగా.. ఆ కుక్క యజమాని సోషల్ మీడియాలో అతనిని కనుగొనడంలో సహాయం కోరాడు. అయితే కొన్ని గంటల తర్వాత గాయాలతో కాస్పర్ చివరికి యజమాని దగ్గరకు తిరిగి వచ్చాడు.
అట్లాంటాకు చెందిన జంతు సంక్షేమ సంస్థ, కాస్పర్ 15,000 డాలర్ల హాస్పిటల్ బిల్లును కవర్ చేయడానికి నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. షీప్ డాగ్ అనే బ్రీడ్ ను సాంప్రదాయకంగా గొర్రెల పెంపకంలో ఉపయోగించే కుక్క జాతి. వీటిని గొర్రెలు, ఇతర పశువులను రక్షించడానికి ఉపయోగిస్తారు.