గాంధీ విగ్రహం మరో సారి ధ్వంసం.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా..!

Gandhi statue in New York smashed amid wave of continued attacks. భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు.

By Medi Samrat
Published on : 19 Aug 2022 7:30 PM IST

గాంధీ విగ్రహం మరో సారి ధ్వంసం.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా..!

భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. న్యూయార్క్‌ నగరంలో ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో వచ్చిన ఆరుగురు వక్తులు శ్రీ తులసి మందిర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని పెద్ద సుత్తితో పగులకొట్టి ధ్వంసం చేశారు. విరిగిన విగ్రహాన్ని రోడ్డుపై పడేసి.. విద్వేష పదాలు రాశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించగా... 25-30 మధ్య వయసున్న ఆరుగురు వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

వారు అక్కడి నుంచి కార్లలో పారిపోయినట్లు చెప్పారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. న్యూయార్క్‌ రిచ్‌మండ్‌ హిల్స్‌లోని శ్రీ తులసి మందిర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం రెండు వారాల్లో ఇది రెండోసారి. ఈ నెల 3న కూడా దుండగులు అక్కడి గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. 16న ఆ విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ ఈ సంఘటనను ఖండించారు. నేరస్థులను త్వరలో పట్టుకుని చట్టం ప్రకారం శిక్ష విధిస్తామని తెలిపారు.


Next Story