కఠినమైన వ్యాక్సిన్ పాస్‌ చట్టాన్ని ఆమోదించిన ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ

French National Assembly adopts vaccine pass law. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులను అరికట్టడానికి ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ హెల్త్ పాస్‌

By Medi Samrat  Published on  17 Jan 2022 10:52 AM IST
కఠినమైన వ్యాక్సిన్ పాస్‌ చట్టాన్ని ఆమోదించిన ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులను అరికట్టడానికి ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ హెల్త్ పాస్‌ను కఠినమైన వ్యాక్సిన్ పాస్‌గా మార్చే చట్టాన్ని ఆమోదించింది. గత రెండు వారాలుగా జ‌రిగిన‌ చర్చల తర్వాత ఆదివారం సాయంత్రం నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్ జ‌రిగింది. 215 మంది స‌భ్యులు అనుకూలంగా, 58 మంది వ్యతిరేకంగా ఓటు వేయ‌డం ద్వారా బిల్లును ఆమోదించినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ అధికార సంస్థ అయిన రాజ్యాంగ మండలి ఆమోదం పొందిన తర్వాత వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని ఆమోదించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త చట్టం ప్రకారం.. పబ్లిక్ ప్ర‌దేశాల‌లో తిరిగేందుకు కోవిడ్-19 నెగెటివ్ పరీక్షలు ఇకపై చెల్లవు. బార్‌లు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో సందేహాస్పదంగా ఉన్న వ్యాక్సిన్‌ పాస్ హోల్డర్‌ల గుర్తింపును ధృవీకరించడానికి అనుమతించబడతాయి. వ్యాక్సిన్‌ పాస్ 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు సంబంధించినది. 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ పాస్ కలిగి ఉండరు. కానీ తప్పనిసరిగా వారు హెల్త్ పాస్‌ను కలిగి ఉండాలి. గురువారం, ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జనవరి 15న కనీసం 6,00,000 మంది.. బూస్టర్ షాట్ అందుకోనందున వారి ఆరోగ్య పాస్‌ను కోల్పోతారని ప్రకటించింది.


Next Story