చేదు అనుభవం.. దేశాధ్యక్షుడికి చెంపదెబ్బ
France president Emanuel Macron slapped by a man. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా
By Medi Samrat
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆగ్నేయ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. పర్యటనలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్. ఇంతలో ఓ వ్యక్తి మాక్రాన్ తో చేయి కలిపేందుకు ప్రయత్నించగా.. మాక్రాన్ చేయి అందించాడు. ఆ వ్యక్తి మాక్రాన్ తో చేయి కలిపినట్లుగానే కలిపి చెంపపై ఒక్కటిచ్చాడు. ఊహించని ఈ ఘటనకు అధ్యక్షుడుతో పాటు అక్కడున్న వారంతా షాక్ గురయ్యారు. అయితే పక్కనే ఉన్న మాక్రాన్ అంగరక్షకులు వెంటనే స్పందించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
🚨🇫🇷 | BREAKING: Macron slapped in the face
— Politics For All (@PoliticsForAlI) June 8, 2021
Via @ConflitsFrance pic.twitter.com/1L7eYTsvDR
ఈ ఘటన డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో జరిగింది. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికలలో మాక్రాన్ తిరిగి ఎన్నిక కావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల నాడిని తెలుసుకునేందుకు అధ్యక్షుడు ఈ పర్యటన చేపట్టాడు. అనుకోని ఈ ఘటనతో మాక్రాన్ అందరి దృష్టిలో పడినట్టయ్యింది. ఇక పోల్స్ లో మాక్రాన్ ప్రత్యర్ధి మెరైన్ లే పెన్ కంటే వెనుకబడ్డారని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని జీన్ కాస్టెక్స్ పార్లమెంటులో మాట్లాడుతూ.. రాజకీయాలలో హింస, అతి దూకుడు సరైన పద్ధతులు కావు అని అన్నారు.