ఘోర విమాన ప్రమాదం.. ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల దుర్మరణం

Four football players killed in Brazil plane crash. బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల దుర్మరణం.

By Medi Samrat
Published on : 25 Jan 2021 1:22 PM IST

Four football players killed in Brazil plane crash

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బ్రెజిల్‌లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్​లో ప్లైట్‌ టేకాఫ్‌ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది.

ఈ ఘ‌ట‌న‌లో పామాస్ ఫుట్‌బాల్ క్లబ్‌ అధ్యక్షుడితో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. విలానోవా జట్టుతో ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. టేకాఫ్‌ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలకూలడంతో ప్రమాదం జరిగింది. దీంతో విమానంలో ఉన్న అంద‌రూ మృతి చెందారు.

మృతి చెందిన వారిలో పామాస్ ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షుడు లుకాస్ మెయిరా, ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారి ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.


Next Story