మన భూమ్మిద ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉండే ప్రభుత్వాలు తమ ప్రజల కోసం ఎన్నో రూల్స్ తీసుకువస్తుంటాయి. కొన్ని దేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటే.. మరికొన్ని ఉన్న లేనట్లుగానే విచిత్రమైన చట్టాలు ఉంటాయి. కొన్ని దేశాల్లో మాహిళలను కన్నెతి చూసినా, తల్లిదండ్రులను తిట్టినా, పిల్లలను కొట్టినా, మహిళలు సరైన వస్త్రాధారణ చేయకపోయినా నేరం మోపుతుంటారు. ఇలా ఏ దేశానికి సంబంధించిన చట్టాలు.. ఆ దేశాల్లో అమలు అవుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఓ విచిత్ర చట్టం గురించి. ఆ చట్టం ఏంటనుకుంటున్నారా.. భార్య పుట్టిన రోజును మర్చిపోతే భర్తకు జైలు శిక్ష విధిస్తారు.
పసిఫిక్ సముద్రంలోని పోలినెసియన్ అనే ప్రాంతంలో సుమోవా అనే ఓ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ చూడటానికి ఎంతో అద్బుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న చట్టాలే కొంచెం కఠినంగా ఉంటాయి. భార్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించే భర్తలకు ఈ ఐలాండ్ ఓ నరకం లాంటింది. ఈ ఐలాండ్‌లో భార్యల పుట్టిన రోజును మర్చిపోతే భర్తలను జైలులో వేస్తారట. నా పుట్టిన రోజు మర్చిపోతావా అంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. మొదటిసారి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినా.. రెండోసారి మాత్రం జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇలాంటి చట్టం ఈ ఒక్క ఐలాండ్‌లో మాత్రమే ఉంది. అలాగే కొన్ని దేశాల్లో కూడా విచిత్ర చట్టాలు ఉన్నాయి. ఈస్ట్ ఆఫ్రికాలో జాగింగ్ చేయడం పూర్తిగా నిషేధం. ఉత్తర కొరియాలో బ్లూ కలర్ జీన్స్ వేసుకుని బయటకెళ్లకూడదు. ఒక్లహోమాలో కుక్కలను తిడితే నేరం కిందకు వస్తుంది. ఇక సింగపూర్ దేశంలో చూయింగ్ గమ్ నమలం పూర్తి నిషిద్ధం.