ఘనా జాతీయ ఆటగాడు, మాజీ న్యూకాజిల్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు మృతదేహం టర్కీలో కనుగొన్నారు. అతను నివసించిన నివాస శిథిలాల క్రింద కనుగొనబడిందని స్థానిక మీడియా నివేదించింది. టర్కీలోని అతని మేనేజర్ మురత్ ఉజున్‌మెహ్మెట్ శనివారం DHA వార్తా సంస్థతో మాట్లాడుతూ టర్కీ దక్షిణ ప్రావిన్స్ హటేలో శిథిలాల కింద అతని మృతదేహం కనుగొన్నారని తెలిపారు. "శిథిలాల కింద అట్సు నిర్జీవమైన శరీరం కనుగొనబడింది. ప్రస్తుతం, మరిన్ని వస్తువులను బయటకు తీస్తున్నారు. అతని ఫోన్ కూడా కనుగొనబడింది," అని తెలిపారు.
ఘనా ఫుట్‌బాల్ ఆటగాడి ఏజెంట్ నానా సెచెరే ట్వీట్ లో "ఈ రోజు ఉదయం పాపం క్రిస్టియన్ అట్సు మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలిసింది. అతని కుటుంబ సభ్యులకు, ప్రియమైనవారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని అన్నారు. అట్సు సెప్టెంబరులో టర్కిష్ సూపర్ లీగ్ లోని Hatayspor జట్టులో చేరారు. మొదట అతడు బతికి ఉన్నాడని కథనాలు వచ్చాయి. కానీ వాటిలో ఎటువంటి నిజం లేదని.. అట్సు ప్రాణాలు కోల్పోయాడని తాజాగా అధికారకంగా తెలిపారు.