మైల్డ్ సింప్టమ్స్ తో బాధపడుతున్న కోవిడ్ రోగుల చికిత్సకు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) ఆమోదించిన మొట్టమొదటి ఓరల్ యాంటీవైరల్ పిల్ 'మోల్నుపిరావిర్' కు భారీగా డిమాండ్ కనిపిస్తోంది. ఓరల్ యాంటీవైరల్ పిల్‌ను మెర్క్, దాని భాగస్వామి రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ పిల్ ను గేమ్‌చేంజర్‌గా ప్రచారం చేస్తున్నారు. జనవరిలో దాని అమ్మకాలు రూ. 46 కోట్లకు చేరుకున్నాయి. అమ్మకాలు ప్రారంభించిన మొదటి నెలలో 46 కోట్ల రూపాయల వ్యాపారం సాగింది.
ఔషధ కంపెనీల కోవిడ్-పోర్ట్‌ఫోలియో - యాంటీవైరల్‌లు ఫెవిప్రివార్, రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వంటివి మునుపటి రెండు వేవ్‌లలో భారీగా అమ్మకాలను నమోదు చేశాయి. గత ఏడాది ఏప్రిల్‌లో గ్లెన్‌మార్క్‌కు చెందిన ఫావిపిరావిర్ ఒక్క నెలలో రూ. 350 కోట్ల అమ్మకాలను సాధించింది. రాబోయే రోజుల్లో ఓరల్ పిల్స్ కు మంచి డిమాండ్ ఉండబోతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పలు కంపెనీలు ఓరల్ పిల్స్ ను తీసుకుని రాబోతున్నాయి.