గ్రీస్‌లో కూలిపోయిన విమానం

Firefighting Aircraft Crashed In Greece. గ్రీస్‌లో అగ్నిమాపక విభాగానికి చెందిన విమానం ఆదివారం కూలిపోయింది. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం

By Medi Samrat  Published on  9 Aug 2021 4:38 AM GMT
గ్రీస్‌లో కూలిపోయిన విమానం
గ్రీస్‌లో అగ్నిమాపక విభాగానికి చెందిన విమానం ఆదివారం కూలిపోయింది. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళం తెలిపింది. పశ్చిమ గ్రీస్‌లోని అయోనియన్ ద్వీపం జాకింతోస్‌లో మంటలను అదుపుచేసే సమయంలో పెజెటెల్ విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. ఇతర అగ్నిమాపక సిబ్బంది సహాయం అందించారని తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది ఆదివారం గ్రీకు ద్వీపమైన ఎవియాలో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. వందలాది మంది ప్రజలు తమ తమ నివాసాలను వదిలి వెళ్లారు. గ్రీస్‌, టర్కీ దాదాపు రెండు వారాలుగా అగ్ని ప్రమాదాల బారిన పడ్డాయి. ఈ ప్రాంతంలో దశాబ్దాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. మంటల్లో చిక్కుకొని గ్రీస్‌లో ఇద్దరు.. టర్కీలో ఎనిమిది మంది మరణించారు. డజన్ల కొద్దీ జనం ఆసుపత్రి పాలయ్యారు. వారాంతంలో వర్షం కురవడంతో టర్కీలో వేడి నుంచి కొంత ఉపశమనం లభించినా.. గ్రీస్‌లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో 17 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్‌లు రెండో అతిపెద్ద ద్వీపమైన ఎలివియాలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.


"మా ఎదుట మరో కష్టమైన సాయంత్రం, మరో కష్టమైన రాత్రి ఉంది" అని పౌర రక్షణ ఉప మంత్రి నికోస్ హర్దాలియాస్ అన్నారు. "ఎవియాలో మాకు రెండు ప్రధాన అగ్నిమాపక ఫ్రంట్‌లు ఉన్నాయి, ఒకటి ఉత్తరాన ఒకటి మరియు దక్షిణాన ఒకటి" అని హర్దాలియాస్ చెప్పారు. బలమైన వేడి గాలులు ఉత్తర ఫైర్ ఫ్రంట్‌ను బీచ్ గ్రామాల వైపుకు వస్తున్నాయని ఆయన తెలిపారు.

మంటల్లో గ్రీస్:

గ్రీస్ దేశంలో కార్చిచ్చు చుట్టుముట్టడంతో అనేక ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు నిరాశ్రులయ్యాయి. సుమారు 1500 గ్రీస్ ఫైర్ ఫైటర్లు, 15 విమానాలు, హెలికాఫ్టర్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా యత్నిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమ దేశం నుంచి అత్యంత అనుభవజ్ఞులైన ఫైర్ ఫైటర్లను పంపుతున్నట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రి ప్రీతీ పటేల్ తెలిపారు. ఆ దేశానికి ఇంతటి ఘోర విపత్తు ఎన్నడూ రాలేదని అన్నారు. శుక్రవారం నాడు 100 డిగ్రీల ఫారెన్ హీట్ నమోదైనట్టు గ్రీస్ వాతావరణ శాఖ వెల్లడించింది. బ్రిటన్ తో బాటు ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలు కూడా తమ సాయాన్ని ప్రకటించాయి. గత 10 రోజుల్లో 57 వేల హెక్టార్లు అగ్నికి ఆహుతైనట్టు యూరోపియన్ ఫారిన్ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తెలిపింది. 2008-2020 మధ్య కాలంలో ఇలాంటి విపత్తుకు 1700 హెక్టార్లు మాత్రం ఆహుతవ్వగా.. భారీ ఆస్తి నష్టం జరిగిందని గ్రీస్ ప్రధాని మిసోతకీస్ చెప్పారు. టర్కీ కూడా మంటలకు అల్లాడుతూ ఉంది.


Next Story