త‌ప్పిపోలేదు.. చనిపోయింది..!

మెక్సికన్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన 23 ఏళ్ల మరియన్ ఇజాగ్యుర్రే కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

By -  Medi Samrat
Published on : 16 Sept 2025 7:26 PM IST

త‌ప్పిపోలేదు.. చనిపోయింది..!

మెక్సికన్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన 23 ఏళ్ల మరియన్ ఇజాగ్యుర్రే కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే కొన్ని రోజుల తర్వాత మరణించినట్లు తేలింది. సెప్టెంబర్ 6న సెంట్రల్ మెక్సికోలోని మోరేలియా నగరంలోని ఒక హోటల్ గదిలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు, వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఆమె సెప్టెంబర్ 12న మరణించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.

ఇజాగ్యుర్రే చాలా రోజులుగా బస చేసిన హోటల్‌లో అనారోగ్యంతో ఉన్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. ఆమెకు పారామెడిక్స్ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియాలో తన ఫ్యాషన్, జీవనశైలి కంటెంట్ ద్వారా మరియన్ ఇజాగ్యుర్రే అనుచరులను ఏర్పరచుకుంది.

మరియన్ ఇజాగ్యుర్రేకు టిక్‌టాక్‌లో 4.5 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఆకస్మిక మరణం అభిమానులకు షాక్ కు గురిచేసింది.

Next Story