ఇప్పటి వరకు ఏ పాకిస్తానీ ఎంపీ ఇంత ధైర్యం చేయ‌లేదు.. ప్రియాంకకు ప్రశంస‌లు

పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాడటంపై ఇజ్రాయెల్ నుంచి పాకిస్థాన్ వరకు చర్చ జరుగుతోంది.

By Kalasani Durgapraveen  Published on  17 Dec 2024 11:53 AM IST
ఇప్పటి వరకు ఏ పాకిస్తానీ ఎంపీ ఇంత ధైర్యం చేయ‌లేదు.. ప్రియాంకకు ప్రశంస‌లు

పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాడటంపై ఇజ్రాయెల్ నుంచి పాకిస్థాన్ వరకు చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఫవాద్ చౌదరి కూడా తన X ఖాతాలో ప్రియాంక గాంధీ ఫోటోను పంచుకుని.. ఆమెను ప్రశంసించారు. ఫోటోలో ప్రియాంక గాంధీ భుజంపై పాలస్తీనాకు మద్దతుగా ధ‌రించిన‌ బ్యాగ్ ఉంది. బ్యాగ్‌పై పుచ్చకాయతో సహా ఇతర చిహ్నాలు ఉన్నాయి. పాలస్తీనా సంస్కృతిలో ఈ చిహ్నాలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.

ఫవాద్ చౌదరి ట్వీట్‌లో.. జవహర్‌లాల్ నెహ్రూ లాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి మనవరాలి నుండి మనం ఇంకా ఏమి ఆశించగలం అని మాజీ మంత్రి ఫవాద్ చౌదరి రాశారు. ప్రియాంక గాంధీ తనను తాను చాలా స్థిరపరుచుకున్నారు. ఇప్పటి వరకు ఏ పాకిస్థానీ ఎంపీ కూడా ఇంత ధైర్యం ప్రదర్శించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

ప్రియాంక గాంధీ సోమవారం బ్యాగుతో పార్లమెంటుకు చేరుకున్నారు. ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో.. కాంగ్రెస్, ప్రియాంక గాంధీ పాలస్తీనాకు మద్దతుగా తమ స్వరం వినిపించారు. పాలస్తీనా రాయబారిని కూడా ప్రియాంక కలిశారు. పాలస్తీనియన్ల పోరాటానికి ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు.

ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల వాయనాడ్ లోక్‌సభ స్థానం నుండి ఉప ఎన్నికలో విజయం సాధించారు. గతంలో ఆమె సోదరుడు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. రాయ్‌బరేలీలో గెలిచిన రాహుల్‌ వాయనాడ్‌ సీటును వ‌దిలేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రియాంక పార్లమెంటుకు చేరుకుంది.

ప్రియాంక గాంధీ వాద్రా బ్యాగ్‌పై భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్పందించింది. గాంధీ కుటుంబం ఎప్పుడూ బుజ్జగింపుల సంచిని మోస్తున్నదని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. ఈ బుజ్జగింపు కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమని ఆయన అన్నారు.

Next Story