జస్టిస్ ఫర్ నూర్.. స్నేహితులే క్రూరంగా హింసించి..!
Ex-diplomat’s daughter killed. పాకిస్తాన్ లో ఆ దేశ మాజీ దౌత్యవేత్త కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చడం
By Medi Samrat Published on 26 July 2021 5:53 AM GMTపాకిస్తాన్ లో ఆ దేశ మాజీ దౌత్యవేత్త కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చడం సంచలనంగా మారింది. ఈ సంఘటన గత మంగళవారం జరిగింది. పాకిస్తాన్‌కు చెందిన శౌకత్ ముకద్దమ్ గతంలో దక్షిణ కొరియా, కజికిస్తాన్‌లకు దౌత్యావేత్తగా పనిచేశారు. కొంత మంది దుండగులు ఆయన కుమార్తె నూర్ ముకద్దమ్‌ను కిడ్నాప్‌చేసి అతి దారుణంగా చంపేశారు. ఆమె మృతదేహన్ని ఇస్లామాబాద్‌లోని ఎఫ్ 4 సెక్టార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. పాక్ పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
నూర్ ముకద్దమ్ ను అతికిరాతకంగా హత్య ఘటన పాక్ అట్టుడుకిపోయేలా చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున్న దుమారం రేపుతోంది. #Justicefornoor హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఇస్లామ్‌బాద్ సెక్టార్ ఎఫ్-7/4లోని ఓ ఇంట్లో ఆమెను హత్య చేశారు. ఆ ఇల్లు ఆమె స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్‌ది. హత్య జహీర్ చేసిందనేనని నిర్ధారించిన పోలీసులు.. శనివారం దాకా అతన్ని అరెస్ట్ చేయలేదు. అతని మానసిక స్థితి సరిగాలేదని, అతన్ని చికిత్స కోసం తరలించాలని ఇస్లామాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తానని నూర్ చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం నూర్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆమె తన దగ్గర లేదని జకీర్ బదులిచ్చాడు. అదేరోజు రాత్రి ఆమె మృతదేహం దొరికినట్లు ఖోహ్‌సర్ పోలీసులు నూర్ తండ్రి షౌకత్‌కు సమాచారం అందించారు. నూర్ ను బతికుండగానే చిత్రవధ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ఒంటిపై అన్ని చోట్లా కత్తి గాట్లు ఉన్నాయని.. సూదులతో వీపులో గుచ్చారని.. జుట్టు కత్తించేశారని తెలుస్తోంది. ఆమె శరీరాన్ని తగలబెట్టి.. పదునైన ఆయుధంతో పీక కోశారు. తల, మొండాన్ని వేరు చేసి దూరంగా పడేశారు. అత్యాచారానికి గురైందన్న బాధితురాలి తండ్రి షౌకత్ అనుమానాలపై డాక్టర్ల నుంచి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.
బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జకీర్‌ను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇస్లామాబాద్‌లో ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈవో జకీర్ జాఫర్ కొడుకే జహీర్ జకీర్ జాఫర్. జహీర్ కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చాడు. జహీర్ జకీర్ జాఫర్ మానసిక స్థితి బాగానే ఉన్నప్పటికీ.. పోలీసులు తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పలుకుబడితో బయటపడే ప్రయత్నం చేస్తున్నారని జనాలు ఆరోపిస్తున్నారు.