కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి వచ్చేసింది..!

EU Approves Johnson And Johnson Covid-19 Vaccine. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే రెండు డోస్ లు వేయించుకోవాలి.

By Medi Samrat  Published on  13 March 2021 2:41 AM GMT
కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి వచ్చేసింది..!
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే రెండు డోస్ లు వేయించుకోవాలి. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై చాలా రోజులుగా ప్రయోగాలు చేసి అందులో సక్సెస్ సాధించింది. ఇప్పుడు సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది.


ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ 'యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ' (ఈఎంఏ) అనుమతులు మంజూరు చేసింది. తద్వారా యూరప్ ఖండంలోని 27 దేశాలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జాన్సన్ అండ్ జాన్సన్ అందించిన వ్యాక్సిన్ డేటాను సమగ్రంగా పరిశీలించిన మీదటే అనుమతి ఇచ్చినట్టు యూరప్ డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ఈ సింగిల్ వ్యాక్సిన్ సమర్థ పనితీరుతో ప్రజల జీవితాలను సురక్షితంగా ఉంచుతుందని భావిస్తున్నట్టు ఈఎంఏ వర్గాలు వెల్లడించాయి.

జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన టీకా యూఎస్ లో 85.9 శాతం, సౌతాఫ్రికాలో 81.7 శాతం, బ్రెజిల్ లో 87.6 శాతం ప్రభావవంతమైనదని రుజువైంది. మార్చి చివరికి 2 కోట్ల డోస్ లను, జూన్ నాటికి 10 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందిస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ కొద్ది వారాల కిందట తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ లు వచ్చిన తరువాత ట్రయల్స్ జరుపుకుందని నిపుణులు తెలిపారు. కొత్త కరోనా రకాల పైనా ఇది పని చేస్తున్నట్టుగా తేలిందని అన్నారు.


Next Story