Video : ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ.. వివాదంలో ఎలోన్ మస్క్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడయ్యారు. ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat  Published on  21 Jan 2025 10:29 AM IST
Video : ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ.. వివాదంలో ఎలోన్ మస్క్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడయ్యారు. ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుని అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని అన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. డొనాల్డ్ ట్రంప్ మార్స్‌పైకి వెళ్లడం గురించి మాట్లాడినప్పుడు.. ఎలోన్ మస్క్ చాలా సంతోషంగా కనిపించాడు.

మస్క్ కూడా కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపి భవిష్యత్తు గురించి మాట్లాడారు. అన్నింటికంటే.. విజయం అంటే ఇదే అనిపిస్తుంది. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి అని వ్యాఖ్యానించాడు.

మస్క్ అంతరిక్ష యాత్రల గురించి మాట్లాడుతూ.. అమెరికన్ వ్యోమగాములు మ‌న‌ దేశ‌ జెండాను మరొక గ్రహానికి తీసుకువెళుతున్నప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించగలరా.? మీ కోసం నేను కష్టపడి పని చేస్తానని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు.

ప్రసంగం తర్వాత మస్క్ చేసిన అభివాదం సోషల్ మీడియాలో వివాదాన్ని సృష్టించింది. కొంతమంది మస్క్ అభివాదాన్ని నాజీ సెల్యూట్‌గా అభివర్ణించారు. అయితే కొందరు దీనిని సమర్థించారు. నాజీ సెల్యూట్‌ని హిట్లర్ సెల్యూట్ అని కూడా అంటారు. ఈ అభివాదాన్ని హిట్లర్ స్వయంగా జర్మనీలో గ్రీటింగ్‌గా ఉపయోగించారు.

మస్క్‌ని విమర్శిస్తూ.. ఒక సోషల్ మీడియా వినియోగదారు ఇలా వ్రాశాడు.. ట్రంప్‌ను గెలిపించినందుకు తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపిన‌ మస్క్ yhr zeeg heil సెల్యూట్ చేశాడని నేను నమ్మలేకపోతున్నాను.. ఎంత చెత్త. ది ఫకి..గ్ నాజీ సెల్యూట్. అంతరిక్ష యాత్రల కోసం నేను మస్క్ బుల్‌షిట్‌ను విస్మరించగలను.. కానీ నేను ఇకపై ఈ బుల్‌షిట్‌ను విస్మరించలేనని ఫైర్ అయ్యాడు.

మస్క్ పూర్తి నాజీ సెల్యూట్ ఇచ్చాడని, ఇది తప్పు.. అని మరో వినియోగదారు కామెంట్ చేశాడు.

Next Story