భారత్‌లో పర్యటించనున్న టెస్లా అధినేత మస్క్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టెలిఫోన్ సంభాషణ నిర్వహించిన ఒక రోజు తర్వాత.. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారతదేశానికి రానున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటనకు వస్తున్నట్లు చెప్పారు.

By Medi Samrat
Published on : 19 April 2025 6:51 PM IST

భారత్‌లో పర్యటించనున్న టెస్లా అధినేత మస్క్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టెలిఫోన్ సంభాషణ నిర్వహించిన ఒక రోజు తర్వాత.. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారతదేశానికి రానున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటనకు వస్తున్నట్లు చెప్పారు. టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో మస్క్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్, అమెరికా సుంకాలపై తేడాలను తొలగించి వాణిజ్య ఒప్పందం దిశగా కృషి చేస్తున్న తరుణంలో, ఎలోన్ మస్క్‌తో ప్రధానమంత్రి మోదీ చర్చలు కీలకంగా మారాయి. తాను టెక్ బిలియనీర్‌తో మాట్లాడానని, సాంకేతికత ఆవిష్కరణలలో సహకారం కోసం చర్చించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఎలోన్ మస్క్‌ను కలిశారు. స్పేస్‌ఎక్స్ సీఈఓతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్ కూడా మోదీని కలిశారు.

Next Story