ట్విట్టర్ లో సినిమాలు చూసేలా మార్పులు చేయబోతున్నారా..?
Elon Musk takes over Twitter, says 'the bird is freed'. ట్విట్టర్ ను బిలియనీర్ ఎలన్‌మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 28 Oct 2022 8:45 PM ISTట్విట్టర్ ను బిలియనీర్ ఎలన్‌మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 'బర్డ్ వాజ్ ఫ్రీ' అని ట్వీట్ చేశారు మస్క్. ట్విట్టర్ వేదికగా ప్రజలు సినిమాలు చూడాలని, ట్విట్టర్‌పై వీడియో గేమ్స్ ఆడుకునేలా చేయాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. సంస్థ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలోనూ మార్పులు తేనున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌ను బెస్ట్ అడ్వర్టైజింగ్ వేదికగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నామన్నారు. ట్విట్టర్‌ను డబ్బు సంపాదనకు టేకోవర్ చేయడం లేదని, మానవత్వాన్ని పెంపొందించేందుకు కొనుగోలు చేశానని తెలిపారు. ట్విట్టర్‌లో ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లపై తనతోపాటు ఇన్వెస్టర్లను పరాగ్, మిగతా ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు తప్పుదోవ పట్టించారని మస్క్ ఆరోపించారు.
ప్రస్తుతం ట్విట్టర్‌లో పని చేస్తున్న 7500 మంది ఉద్యోగుల్లో 75 శాతం మందిని ఇంటికి సాగనంపుతారని ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ ఒక వార్తాకథనం ప్రచురించింది. ఇన్వెస్టర్లతో జరిగిన భేటీలో ఎలన్‌మస్క్ ఈ ప్రతిపాదన చేశారని ఆ వార్త సారాంశం. కానీ తాను నాలుగింట మూడొంతుల మంది అంటే సుమారు 5,600 మంది సిబ్బందిని తొలగించబోనని ఎలన్‌మస్క్ హామీ ఇచ్చారు.
ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28 లోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ కోర్టు తుది గడువు విధించిన నేపథ్యంలో ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నారు. మొత్తంగా 44 బిలియన్ డాలర్లకు ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం వచ్చీ రాగానే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌లను తొలగించారు.