పురుషులు ఏ కొంచెం ఎక్కువ శ్రమించినా బాగా అలసిపోయాం... ఇక విశ్రాంతి కావాల్సిందే అంటారు. కానీ మహిళ మాత్రం ఓ బిడ్డను మోస్తున్నా ఇంటి పని చేస్తుంది. ఆఫీస్‌కెళ్లి డ్యూటీ చేస్తుంది. అంతేగానీ... నెలతప్పిన నాటి నుంచి ప్రసవించే దాకా రెస్ట్ తీసుకుంటానని తనకు తానుగా భీష్మించుకోదు కదా! ఇదే జరిగితే మన పొద్దు గడవడం కాదు... ప్రపంచమే నడవకుండా 'లాక్‌డౌన్' అయ్యేది. ఇక విషయానికొస్తే... ఓ మహిళ మరో అడుగు ముందుకేసింది.
దృఢమైన సంకల్పం ఉంటే ఏదీ సాధ్యం కాదని నైజారియాకుచెందిన 26 ఏళ్ల అమితాస్ ఇద్రిస్ నిరూపించింది. కడుపులో బిడ్డను పెంచుతూ, అది కూడా ఎనిమిది నెలల బిడ్డను గర్భంలో దాచుకుని, ఆటల పోటీల్లో పాల్గొనడం అత్యంత అరుదు. అలా పోటీ పడి, పతకం కూడా సంపాదిస్తే, అది అద్భుతమే. అదే అద్భుతాన్ని సాధించింది అమితాస్ ఇద్రిస్. నైజీరియాలోజరిగిన స్పోర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా తైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మిక్స్ డ్ పూమ్సే కేటగిరీలో స్వర్ణపతకం సాధించిన అమితాస్, మరో మూడు విభాగాల్లోనే పతకాలు సొంతం చేసుకోవడం గమనార్హం. అమితాస్ సంకల్పంపై ఇప్పుడు సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.