ఈజిప్టు.. ఎన్నో అద్భుతాలకు నిలయం. ప్రాచీన చరిత్ర దాగి ఉంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కైరోలోని పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ప్రకారం, స్పానిష్ పురావస్తు మిషన్ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో సైటే రాజవంశం (664 BC-525 BC) నాటి రెండు సమాధులను వెలికితీశారు. బార్సిలోనా విశ్వవిద్యాలయం నుండి ప్రతినిధి బృందం బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు తెలియని మానవుల అవశేషాలను ఒక సమాధిలో కనుగొన్నారు. పురాతన వస్తువుల సుప్రీం కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ముస్తఫా వజీరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాధి లోపల స్త్రీ ఆకారంలో కవర్‌తో కూడిన సున్నపురాయి శవపేటికను కనుగొన్నామని, అలాగే శవపేటికకు దగ్గరగా ఓ వ్యక్తి అవశేషాలను కనుగొన్నట్లు వజీరి చెప్పారు.
సమాధిపై ప్రాథమిక పరిశోధన ప్రకారం.. పురాతన కాలంకు చెందినదని సూచించింది. ఒక కుండలో 402 ఉషబ్తి బొమ్మలు ఉన్నాయని, అలాగే చిన్న తాయెత్తులు మరియు పచ్చని పూసలు కూడా అక్కడ ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ తర్వాత సిబ్బంది రెండవ సమాధిని కనుగొన్నారు.. అది పూర్తిగా మూసివేయబడిందని.. త్రవ్వకాలలో మొదటిసారిగా తెరిచిందని గుర్తించారు. మిషన్ యొక్క త్రవ్వకాల డైరెక్టర్ హసన్ అమెర్ బృందం రెండవ సమాధి వద్ద మంచి స్థితిలో మానవ ముఖంతో సున్నపురాయి శవపేటికను అలాగే రెండు కనోపిక్ కుండలను కనుగొన్నట్లు తెలిపారు.