సోమవారం నాడు సముద్రతీర దేశాలైన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలో బలమైన లోతులేని నీటి అడుగున భూకంపాలు సంభవించాయి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. అంతకుముందు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇండోనేషియాలో పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పరియామాన్ పట్టణానికి పశ్చిమాన 169 కిలోమీటర్ల దూరంలో 16 కిలోమీటర్ల లోతులో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రావిన్స్‌లోని చాలా ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని ఇండోనేషియా వాతావరణ కేంద్రం, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
భూకంపం మనీలా ట్రెంచ్ వెంబడి కదలికతో ఏర్పడిందని, దాని కేంద్రం మనీలాకు దక్షిణంగా ఉన్న ఆక్సిడెంటల్ మిండోరో ప్రావిన్స్‌లోని లుబాంగ్ ద్వీపానికి పశ్చిమాన 110 కిలోమీటర్ల దూరంలో ఉందని ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. దీని లోతు దాదాపు 28 కిలోమీటర్లు. ఇదిలా ఉంటే ఫిలిప్పీన్స్‌లో కూడా భూకంపం వచ్చింది. బటాన్ ప్రావిన్స్‌లోని లుజాన్ దీవిలో ఇవాళ ఉదయం 5.05 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. మనీలాకు 157 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం ధాటికి మనీలాలోని ఇళ్లు వణికిపోయాయి. ప్రజలు ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు పెట్టారని అధికారులు తెలిపారు.