శ్రీలంకలోని కొలంబోలో మంగళవారం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. ఈ రోజు మధ్యాహ్నం 12.31 గంటలకు దేశంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
భౌకంపం ధాటికి భయాందోళనలకు గురైన ప్రజలు.. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కొలంబోకి ఆగ్నేయ దిశగా 1,326 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌లో కూడా మంగళవారం భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చింది. కార్గిల్‌లో భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు ఇంకా నివేదించబడలేదు.