Earthquake : ఇజు ద్వీపంలో భూకంపం.. 4.6 తీవ్ర‌త‌

జపాన్‌లోని ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 March 2023 4:06 AM

Earthquake,Earthquake Jolts Japans Izu Island

ఇజు ద్వీపంలో భూకంపం

జ‌పాన్ దేశంలో భూమి కంపించింది. శుక్ర‌వారం ఉద‌యం 6.45 గంట‌ల స‌మ‌యంలో ఇజు ద్వీపంలో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. దీని తీవ్ర‌త 4.6గా న‌మోదు అయ్యింది. భూమికి 28.2 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే(యుఎస్‌జిఎస్) తెలిపింది. అయితే.. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు. కాగా.. ఇజు ద్వీపం అగ్నిపర్వతాలకు నెలవు. ఇక్క‌డ‌ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.

ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం ఆఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌ పర్వత శ్రేణుల్లో భూమి కంపించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 6.6గా న‌మోదైంది. దీని ప్రభావంతో పాకిస్థాన్‌లోని ప‌లు న‌గ‌రాల్లో భూమి కంపించింది. మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌తో పాటు తుర్కెమినిస్థాన్‌, క‌జ‌కిస్తాన్ వంటి దేశాల్లోనూ దీని ప్ర‌భావం క‌నిపించింది.

Next Story