పాకిస్థాన్ లో మత మార్పిడులు ఎలా ఉంటాయో నేహా ఉదంతం ఓ ఉదాహరణ

Each year 1,000 Pakistani girls forcibly converted to Islam. పాకిస్థాన్ లో ఇస్లాం తప్ప మరో మతాన్ని కూడా బ్రతకనివ్వడం లేదని

By Medi Samrat  Published on  29 Dec 2020 1:54 PM GMT
పాకిస్థాన్ లో మత మార్పిడులు ఎలా ఉంటాయో నేహా ఉదంతం ఓ ఉదాహరణ

పాకిస్థాన్ లో ఇస్లాం తప్ప మరో మతాన్ని కూడా బ్రతకనివ్వడం లేదని అక్కడ చోటు చేసుకున్న ఉదంతాల ద్వారా తెలుస్తూ ఉంది. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ లో ఉన్న హిందువులతో పోలిస్తే ఇప్పుడు ఉన్న హిందువుల శాతంతో పోలిస్తే అక్కడ చోటు చేసుకున్న ఘటనల గురించి స్పష్టంగా అర్థం అవుతుంది. హిందువులు, క్రైస్తవుల మీద దాడులు అక్కడ ఎప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించడం.. పెళ్లిళ్లు చేసుకోవడం..! ఒప్పుకోకపోతే హింసించి చంపేదాకా వదలరు.

తాజాగా నేహా అనే ఓ క్రైస్తవురాలు పాకిస్థాన్ లో పడిన బాధలు తాజాగా ప్రపంచం మొత్తానికి తెలిసింది. గతేడాది ఆమెను బలవంతంగా క్రైస్తవం నుంచి ఇస్లాంలోకి మతమార్పిడి చేశారు. అప్పటికి ఆమెకు 14 ఏళ్లు. తనకంటే మూడు రెట్లు అధిక వయసున్న వ్యక్తి (45)తో ఆమెకు పెళ్లి చేశారు. అతడికి అప్పటికే ఇద్దరు పెద్ద పిల్లలున్నారు. ఇప్పుడు నేహా భర్త జైల్లో ఉన్నాడు. పెళ్లి వయసు కూడా రాని అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణపై అతడిపై అభియోగాలు మోపారు. తన సోదరుడు జైలు పాలవడానికి నేహానే కారణమని అతడి మరిది నేహాను కాల్చేందుకు కోర్టులోనే తుపాకీ తీశాడంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతుంది. ప్రస్తుతం నేహా అజ్ఞాతంలో ఉంది. ఇందుకు పాకిస్థాన్ లోని చట్టాలు, నాయకులే కారణం అని చెబుతూ ఉన్నారు.

పాకిస్థాన్ లో ఏటా 1000 మంది అమ్మాయిల వరకు మతమార్పిడికి గురవుతున్నారు. మైనారిటీ వర్గాల నుంచి వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారు. కేవలం పెళ్లిళ్ల కోసమే ఇలా చేస్తున్నారని పాక్ లోని మానవ హక్కుల సంఘాలు చెబుతూ ఉన్నాయి. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారింట్లో ఉన్న అమ్మాయిలను మతమార్పిడి చేసి పెళ్లిళ్లు జరిపిస్తూ ఉన్నారు. హిందూ, సిక్కు, క్రైస్తవ వర్గాల్లోని బాలికలు ఈ తరహా అపహరణలకు గురవుతున్నారని అమెరికా ప్రభుత్వ అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ వెల్లడించింది.


Next Story