రసాయన శాస్త్రంలో నోబెల్ వచ్చింది వారికే..

Duo win Chemistry Nobel for developing tool to build molecules. రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఇద్దరిని వరించింది. అసిమెట్రిక్‌ ఆర్గానో క్యాటలసిస్‌ను

By Medi Samrat  Published on  6 Oct 2021 12:56 PM GMT
రసాయన శాస్త్రంలో నోబెల్ వచ్చింది వారికే..

రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఇద్దరిని వరించింది. అసిమెట్రిక్‌ ఆర్గానో క్యాటలసిస్‌ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్​ డబ్ల్యూసీ మెక్‌మిల్లన్‌ లకు 2021గానూ నోబెల్‌ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం ప్రకటించింది. 'అణువులను నిర్మించడం చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటిది పరమాణువు నిర్మాణంలో ఆర్గానో క్యాటలసిస్‌ అనే స్పష్టమైన నూతన విధానాన్ని బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌ అభివృద్ధి చేశారు. ఇది ఔషధాల పరిశోధనల్లో గొప్ప ప్రభావం చూపించింది.

రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చింది''అని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తెలిపింది. ఈ క్యాటలసిస్‌ను శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలో అభివృద్ధి చేసినట్లు తెలిపింది. వైద్య శాస్త్రంలో నోబెల్​ బహుమతిని అమెరికన్‌ శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లు దక్కించుకున్నారు. భౌతిక శాస్తంలో నోబెల్ పురస్కారం ప్రకటించంగా.. సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలు ఎంపికయ్యారు. నోబెల్ పురస్కారం కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ నగదు బహమతిగా అందజేస్తారు.


Next Story