బుర్జ్ ఖలీఫాపై మహాత్ముడి ఫోటో

Dubai’s Burj Khalifa lights up with Mahatma Gandhi’s image on his birth anniversary. జాతి పిత మహాత్మాగాంధీ 152వ జ‌యంతిని ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో నిర్వహించారు.

By Medi Samrat  Published on  3 Oct 2021 9:24 AM GMT
బుర్జ్ ఖలీఫాపై మహాత్ముడి ఫోటో

జాతి పిత మహాత్మాగాంధీ 152వ జ‌యంతిని ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో నిర్వహించారు. శాంతికి ప్రతిబింబమైన గాంధీని పలు దేశాల నాయకులు ఒక ఐకాన్ గా గుర్తించారు. ఆయన జయంతి సందర్భంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బుర్జ్ ఖలీఫా భ‌వ‌నంపై ఆయన ఫోటోను ఉంచారు. గాంధీ గౌర‌వార్థం.. యూఏఈ ప్ర‌భుత్వం ఇలా ఆయ‌న ఫొటోను భ‌వ‌నంపై ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌పంచంలోని మీరు కావాల‌నుకుంటున్న మార్పును మీతోనే మొద‌లుపెట్టండ‌న్న గాంధీజీ వ్యాఖ్య‌ల‌ను ఉంచి.. బుర్జ్ ఖ‌లీఫా దీనికి సంబంధించిన వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఆయ‌న ఎన్నో త‌రాల‌కు స్ఫూర్తిగా నిలిచార‌ని కొనియాడింది. గాంధీ జ‌యంతిని అంత‌ర్జాతీయంగా అహింసా దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. శ‌నివారం నాడు భారత్ లో స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. దుబాయ్‌లోని బుర్జ్ ఖ‌లీఫా ప్ర‌తి ఏటా ఇండియా స్వాతంత్ర్య‌, గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా మ‌న జాతీయ ప‌తాకాన్ని కూడా ఇలాగే ప్ర‌ద‌ర్శిస్తుంది.

""Be the change you wish to see in the world" - Mahatma Gandhi. Burj Khalife celebrates Gandhi by honouring the father of a nation who's been an inspiration to many generations." అంటూ బుర్జ్ ఖలీఫా ట్విట్టర్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. ఎన్నో దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా గాంధీ చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Next Story