ఇకపై డ్రైవర్‌ లేకుండానే ట్రైన్‌.. టైమింగ్‌ మాత్రం పక్కా..!

Driverless train germany. కాలానికి అనుగుణంగా... టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.

By Medi Samrat  Published on  13 Oct 2021 6:44 AM GMT
ఇకపై డ్రైవర్‌ లేకుండానే ట్రైన్‌.. టైమింగ్‌ మాత్రం పక్కా..!

కాలానికి అనుగుణంగా... టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. భవిష్యత్‌లో రైళ్లకు లోకో పైలట్‌లు అవసరం ఉండదు. సెల్ప్ డ్రైవ్ రైళ్లు వస్తున్నాయి. తాజాగా జర్మనీలో హంబర్గ్‌ నగరంలో ఆటోమెటెడ్ రైలును నడిపారు. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా లోకో పైలట్‌ నడిచిన రైలు. జర్మనీలోని రైల్వే సంస్థ అయిన డాయ్‌చు బాన్‌, సీమన్స్‌ సంస్థలు కలిసి ఈ ఆటోమెటెడ్‌ రైలును తయారు చేశాయి. ఈ రైలు సాధారణ రైళ్లతో పోలిస్తే సమయం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలగే 30 శాతం ఎక్కువ ప్రయాణికులను రవాణా చేయగలదని, 30 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఆటోమెటెడ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.

అయితే మొదటిసారిగా నాలుగు డ్రైవర్‌ ఆటోమెటెడ్‌ రైళ్లుగాను తయారు చేశారు.రైలు పర్యవేక్షణ కోసం ఒక డ్రైవర్‌ను ఉంచుతామని రైలు కంపెనీ అధికారులు తెలిపారు. డాయ్‌చు బాన్‌ సీఈవో రిచర్డ్‌ లూట్జ్‌ మాట్లాడుతూ.. మేం కొత్త ట్రాక్ వేయకుండానే సమయపాలనలో నికచ్చిగల రైళ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. డ్రైవర్ లెస్‌ రైళ్లు రవాణాను మరింత మరింత తెలివిగా చేస్తున్నాయని సీమన్స్‌ సీఈవో రోలాండ్‌ బుష్ అన్నారు.


Next Story
Share it