"అప్పుడు 100 శాతం సుంకం విధిస్తాను".. భారత్, చైనాలకు ట్రంప్ బెదిరింపు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు బలమైన హెచ్చరిక జారీ చేశారు.

By Medi Samrat  Published on  31 Jan 2025 9:29 AM IST
అప్పుడు 100 శాతం సుంకం విధిస్తాను.. భారత్, చైనాలకు ట్రంప్ బెదిరింపు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు బలమైన హెచ్చరిక జారీ చేశారు. అమెరికా డాలర్‌ను గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ నుంచి మార్చే ఏ ప్రయత్నమైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఈ క్ర‌మంలోనే ట్రంప్ బ్రిక్స్ దేశాలను (తొమ్మిది దేశాలు) మరోసారి బెదిరించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తే.. వాటిపై 100 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ అన్నారు. గురువారం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ట్రంప్ 2024 నవంబర్‌లో చేసిన బెదిరింపును పునరుద్ఘాటించారు.. డాలర్ ఆధిపత్యాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించే ఏ బ్రిక్స్ దేశం మీదైనా 100% సుంకాలు విధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో అత్యధికంగా ఉపయోగించే కరెన్సీ US డాలర్.. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా గుత్తాధిపత్యంతో తాము విసిగిపోయామని బ్రిక్స్ సభ్యులు అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు US డాలర్, యూరోపై ప్రపంచం ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాయి. ఇందుకు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. 2023లో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాలు తమ సొంత కరెన్సీని ప్రవేశపెట్టడం గురించి కూడా చర్చించాయి. ఆ సమయంలో బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, పెట్టుబడుల కోసం ఉమ్మడి కరెన్సీని రూపొందించే ప్రతిపాదన కూడా చేయబడింది. ఈ ప్రతిపాదన ట్రంప్‌కు నచ్చలేదు. అందుకే.. ఈ దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించకూడదని.. శక్తివంతమైన యుఎస్ డాలర్‌ను భర్తీ చేయడానికి మరే ఇతర కరెన్సీని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవద్దని అమెరికా కోరుకుంటుంది. అలా జ‌రిగితే 100 శాతం సుంకాలు ఎదుర్కోండి.. లేదా అమెరికాకు వీడ్కోలు ప‌ల‌కండి అని ట్రంప్ హెచ్చ‌రిస్తున్నారు.

బ్రిక్స్ దేశాలకు వ్యతిరేకంగా ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది భారత్‌కు సవాలుగా మారుతుంది. భారతదేశం, అమెరికా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి. సుంకాల విధింపు కారణంగా భారత్‌కు పెద్ద దెబ్బే ఎదురుకావచ్చు. 2023-24లో భారత్‌-US మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం US$118.3 బిలియన్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికా నుంచి 41.6 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది.

Next Story