Donald Trump : మాటలు కాదు.. ఫలితాలు కావాలి..!

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం ఆలస్యం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. కావల్సినన్ని సమావేశాలు జరిగాయని, ఫలితం నాకు కావాలి అని ఆయన సూటిగా చెప్పారు.

By -  Medi Samrat
Published on : 13 Dec 2025 8:31 AM IST

Donald Trump : మాటలు కాదు.. ఫలితాలు కావాలి..!

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం ఆలస్యం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. కావల్సినన్ని సమావేశాలు జరిగాయని, ఫలితం నాకు కావాలి అని ఆయన సూటిగా చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో నెమ్మదిగా సాగుతున్న పురోగతి పట్ల అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర నిరాశకు లోనయ్యారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం మీటింగ్ కోసమే సమావేశాలకు హాజరుకావడానికి ఆయ‌న‌ ఇష్టపడరని పేర్కొంది.

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. 'ఫలితాలు ఇవ్వని సమావేశాలతో అధ్యక్షుడు విసిగిపోయారు. రాష్ట్రపతికి ఫలితాలు కావాలి, కేవలం మాటలు కాదు. నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తి పాత్ర పోషిస్తుండడం గమనార్హం. ఈ మేరకు పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. అయితే శాంతి ఒప్పందానికి సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ యుద్ధంలో రెండు వైపులా ట్రంప్ చాలా నిరాశకు గురయ్యారు. ఈ యుద్ధం ముగియాలని ఆయ‌న‌ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదం గ్లోబల్ వార్ గా మారే అవకాశం ఉందని, ఇలాంటి ఘటనలు చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని అమెరికా గట్టి సూచన చేసింది. గత నాలుగేళ్లుగా జరుగుతున్న‌ ఈ యుద్ధంలో దాదాపు 25,000 మంది సైనికులు మరణించారని ట్రంప్ అన్నారు. అక్క‌డ‌ కొనసాగుతున్న రక్తపాతం పట్ల తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. యుద్ధాన్ని వెంటనే ముగించడానికి తన ప్రయత్నాలను పునరుద్ఘాటించారు.

Next Story