అలా భారత్-పాకిస్థాన్ మధ్య న్యూక్లియర్ యుద్ధం జరగకుండా ఆపా: ట్రంప్

విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, భారతదేశం, పాకిస్తాన్‌ దేశాలు యుద్ధాన్ని ఆపమని తాను కోరానని తెలిపారు.

By Medi Samrat
Published on : 12 May 2025 7:30 PM IST

అలా భారత్-పాకిస్థాన్ మధ్య న్యూక్లియర్ యుద్ధం జరగకుండా ఆపా: ట్రంప్

విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, భారతదేశం, పాకిస్తాన్‌ దేశాలు యుద్ధాన్ని ఆపమని తాను కోరానని తెలిపారు. వారితో వాణిజ్యం చేస్తానని చెప్పానని అన్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో అమెరికా పరిపాలన కీలక పాత్ర పోషించిందని, వాణిజ్య ఒత్తిడి ద్వారా దౌత్యానికి తాను చేసిన విధానం అణు యుద్ధాన్ని నివారించడానికి సహాయపడిందని నొక్కి మరీ చెప్పారు. వాణిజ్య ఒప్పందాలను ఒక దౌత్య సాధనంగా ఉపయోగించి ఈ ఘర్షణను నివారించగలిగానని ట్రంప్ పేర్కొన్నారు. మీరు శాంతించండి, మీతో మేం బోలెడెన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటామని భారత్, పాక్ వర్గాలకు చెప్పామన్నారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించామని ట్రంప్ చెప్పారు.

భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నాయకత్వాలు శక్తిమంతమైనవి, దృఢంగా నిలబడ్డాయని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని చల్లార్చడానికి వాణిజ్యాన్ని ఒక దౌత్య వ్యూహంగా ఉపయోగించినట్లు చెప్పారు. ఈ జోక్యం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న అణు యుద్ధాన్ని ఆపానని ట్రంప్ తెలిపారు. మేము పాక్, భారతదేశం రెండింటితోనూ చాలా వ్యాపారం చేయబోతున్నాము. మేము ప్రస్తుతం భారతదేశంతో చర్చలు జరుపుతున్నాము. త్వరలో పాక్‌తో చర్చలు జరుపుతామని ట్రంప్ వెల్లడించారు.

Next Story