అమెరికా డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్లకు ఎలాంటి కోటా ఉండబోదని, యూఎస్‌తో మహిళల క్రీడలు ఇకపై కేవలం మహిళలకు మాత్రమేనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సిగ్నేచర్ కూడా చేశారు.
ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే వరుసగా పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తూ ట్రంప్ దూకుడుగా ఉన్నారు. మహిళా కోటా కింద ఉన్న ట్రాన్స్ జెండర్ల విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇచ్చారు. బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అథ్లెటిక్స్‌లో ట్రాన్స జెండర్లను మహిళా కోటా కింద అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిర్ణయాన్ని తప్పు బట్టిన ట్రంప్.. ట్రాన్స్ జెండర్లను మహిళా కోటా కిందకు రారని తేల్చేశారు. ఈ మేరకు ఆ విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జి క్యూటివ్ ఆర్డర్లు ఇచ్చారు.
యూఎస్ 47వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై యాక్షన్ ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలగడం, యూఎస్‌లో పుట్టే వలసదారుల పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ హక్కు రద్దు, ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు, ట్రాన్స్ జెండర్లకు హక్కుల తొలగింపు, విదేశాలకు తాత్కాలిక సాయం నిలిపివేత లాంటి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి.