ఈరోజు పుట్టిన పిల్ల‌ల‌కు.. అర‌వై ఏళ్ల దాకా పిజ్జా ఫ్రీ.. డొమినోస్ బంఫ‌ర్ ఆఫ‌ర్‌

Domino's Is Offering Free Pizza For 60 Years. ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినోస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

By Medi Samrat
Published on : 9 Dec 2020 4:18 PM IST

ఈరోజు పుట్టిన పిల్ల‌ల‌కు.. అర‌వై ఏళ్ల దాకా పిజ్జా ఫ్రీ.. డొమినోస్ బంఫ‌ర్ ఆఫ‌ర్‌

ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినోస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు(డిసెంబ‌ర్ 9న‌) పుట్టిన పిల్ల‌ల‌కు అర‌వై ఏళ్ల పాటు పిజ్జాను ఉచితంగా అంద‌జేస్తుంద‌ట‌. డొమినోస్ సంస్థ ప్రారంభించి 60 ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా ఈ బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. కస్టమర్లే తమకు దేవుళ్లని.. వాళ్లు లేకుంటే తమ ప్రయాణం ఇంత దూరం వచ్చేది కాదని డొమినోస్ తెలిపింది. అయితే.. ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉందండోయ్‌.. ఈరోజు పుట్టిన పిల్ల‌ల‌కు త‌మ సంస్థ పేరు క‌లిసేలా పేర్లు పెడితేనే.. ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ట‌.

"ఈ రోజు పుట్టిన పాపకు గానీ.. బాబుకు గానీ Dominic లేదా dominique అనే పేరు పెడితే వాళ్లకు 60 ఏళ్ల దాకా ఫ్రీగా ఫిజ్జా తినొచ్చు. తమ సంస్థను స్థాపించి అరవై ఏళ్లైన సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రకటిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సరిగ్గా అరవై ఏళ్ల క్రితం డొమినోస్ ను ప్రారంభించామని.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో 37 సంవత్సరాలుగా పిజ్జా వ్యాపారంలో ఉన్నామని సంస్థ పేర్కొంది. పై పేర్లు పెట్టిన వారికి అరవై ఏళ్ల దాకా అంటే 2080 దాకా ప్రతి నెల ఉచితంగా ఫిజ్జా అందిస్తామని లేదంటే 720 రాత్రుల పాటు డిన్నర్ ను అందిస్తామని వివరించింది. ఈ ఆఫర్ కోసం దరఖాస్తు చేసుకునే తల్లిదండ్రులకు వచ్చే ఏడాది వరకు ఛాన్స్ ఉంది. డిసెంబర్ 9న పుట్టిన శిశువు యొక్క జనన ధృవీకరణ పత్రంతో పాటు.. వారికి డొమినిక్ అనే పేరును జత చేసి డొమినోస్ ఈమెయిల్ dombaby@dominos.com.au కు మెయిల్ పంపిస్తే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.


Next Story