భారత విద్యార్థులను కొడుతున్న సైన్యం..!

Disturbing Videos Show Indian Students Fleeing Ukraine Brutally Beaten By Forces At Borders. రొమేనియా, పోలాండ్ దళాలు భారతీయ విద్యార్థులను, బాలికలను తన్నడం,

By Medi Samrat  Published on  28 Feb 2022 7:29 AM GMT
భారత విద్యార్థులను కొడుతున్న సైన్యం..!

రొమేనియా, పోలాండ్ దళాలు భారతీయ విద్యార్థులను, బాలికలను తన్నడం, కొట్టడం వంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ట్విట్టర్‌లో ధృవీకరించబడిన హ్యాండిల్స్ ద్వారా వీడియోలు బయటకు వచ్చాయి. ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు వద్ద భారతీయులు రోడ్డుపై కూర్చున్నారు. వారు ఉక్రెయిన్ ను దాటి బయటకు రావాలని అనుకుంటున్నారు. ఆ సమయంలో సరిహద్దు దళాలు భారతీయ విద్యార్థులను తన్నడం, వేధించడం కనిపిస్తుంది. కొన్ని వీడియోలలో ఆఫ్రికన్ విద్యార్థులను కూడా సరిహద్దుల వద్ద దళాలు కొట్టినట్లు వీడియోలు సూచిస్తున్నాయి.

ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దులోని చాలా మంది విద్యార్థులను ఉక్రేనియన్ సైనికులు, పోలీసులు గాలిలో కాల్పులు జరిపి, తమ కార్లను వారి పైకి నడపడానికి ప్రయత్నించారు. ఉక్రెయిన్‌లోకి బలవంతంగా తిరిగి పంపిస్తున్నారని ఆరోపిస్తూ వీడియోలను పలువురు విద్యార్థులు ఇక్కడి కుటుంబ సభ్యులకు, మీడియా సంస్థలకు పంపారు. ఇతర వీడియోలు దేశ సరిహద్దుల్లో బలవంతంగా భారతీయ విద్యార్థులను కొట్టినట్లు చూపుతున్నాయి. ఇంకొన్ని వీడియోలలోని విద్యార్థులు ఏ దేశానికి చెందినవారో ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

ఏంజెల్ అనే మలయాళీ విద్యార్థి తనను, తన స్నేహితుడిని కిందకు నెట్టివేసి కొట్టారని ఒక వీడియోలో చెప్పడం వినవచ్చు. పోలీసులు తమ వాహనాలను విద్యార్థుల గుంపుపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారని, విద్యార్థులు పడిపోయినా ఉక్రెయిన్ సైనికులు పట్టించుకోలేదని ఏంజెల్ అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం, సైన్యం విదేశీ పౌరులతో వ్యవహరించే మార్గం ఇది కాదని ఏంజెల్ తెలిపింది.

ఇతర చిత్రాలు, వీడియోలు పోలాండ్ దేశంలోకి ప్రవేశించడానికి ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు వద్ద వేచి ఉన్న విద్యార్థుల సమూహాన్ని చూపించాయి. చాలా మంది విద్యార్థులు బంకర్లలో ఆశ్రయం పొందారు. బోర్డర్స్ వద్ద సహాయం అందుతుందని హామీ ఇవ్వడంతో వేలాది మంది కాలినడకన పొరుగు దేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది విద్యార్థుల దగ్గర సరైన ఆహారం కూడా లేదు, కొందరు మెట్రో బంకర్‌లో దాక్కున్నారు.


Next Story