యూఎన్‌ఓ సమావేశంలో డైనోసర్‌.. మానవాళిపై తీవ్ర ఆవేదన..!

Dinosaur addressing a UNO meeting. న్యూయార్క్‌లోని యూఎన్‌ఓ ప్రధాన కార్యాలయంలో గల కావెర్‌నోస్‌ హాల్‌లో పర్యావరణ మార్పులపై సర్వసభ్య

By అంజి  Published on  28 Oct 2021 8:25 AM GMT
యూఎన్‌ఓ సమావేశంలో డైనోసర్‌.. మానవాళిపై తీవ్ర ఆవేదన..!

న్యూయార్క్‌లోని యూఎన్‌ఓ ప్రధాన కార్యాలయంలో గల కావెర్‌నోస్‌ హాల్‌లో పర్యావరణ మార్పులపై సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రపంచ నేతలు, పలు దేశాలు దౌత్య వేత్తలు పాల్గొన్నారు. సమావేశం జరుగుతుండగా మధ్యలో ఓ డైనోసర్‌ లోపలికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా సమావేశంలో పాల్గొన్న వారందరూ భయపడ్డారు. ఆ డైనోసర్‌ నేరుగా వేదిక వద్దకు వెళ్లింది. మానవాళిని, ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించింది. ప్రగంలో వాతావరణ మార్పులపై మాట్లాడుతూ.. డైనోసర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వినాశనాన్ని కోరుకోకుండా.. మానవాళిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసింది. వినాశనమనేది చాల చెడ్డ విషయమని, అది మానవాళిని అంతరించిపోయేలా చేస్తుందని పేర్కొంది.

గడిచిన 70 మిలియన్‌ సంవత్సరాల్లో తాను విన్న అత్యంత తెలివి తక్కువ విషయమిదేనంది. వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారని మానవులను ఉద్దేశించి ప్రసంగించింది. శిలాజ ఇంధనాల సబ్సిడీల కోసం ప్రభుత్వాలు ఇంకా ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నాయని, ఆ ధనాన్ని పేద ప్రజలకు సాయంగా ఎందుకు ఉపయోగించట్లేదని, వారికి సాయం చేయడం మీకు ఉత్తమం అనిపించలేదా అంటూ డైనోసర్‌ ప్రశ్నించింది. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు మీకు గొప్ప ఛాన్స్‌ లభించింది. వినానశాన్ని కోరుకోకుండా.. మానవాళిని కాపాడుకోండి అంటూ డైనోసర్‌ సలహా ఇచ్చింది. సాకులు చెప్పడం మాని.. మార్పులు చేపట్టాల్సిన సమయం ఇది అని డైనసర్‌ మానవాళికి సందేశం ఇచ్చింది.

అయితే నిజంగా యూఎన్‌ఓ సమావేశంలోకి డైనోసర్‌ రాలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు యూఎన్‌డీపీ తన మాయతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించింది. గ్రాఫిక్స్‌ డిజైన్‌ ద్వారా ఈ వీడియోను రూపొందించారు. ఇక డైనోసర్‌ వాయిస్‌కు ప్రముఖ సెలబ్రిటీలు పలు భాషల్లో తమ వాయిస్‌ను అందించారు. ఈ వీడియోను యూఎన్‌ఓ ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది.


Next Story