ఈక్వెడార్ రాజధాని క్విటోలో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య కనీసం 22 మందికి పెరిగింది. ఇప్పటివరకు 47 మంది గాయపడ్డారని అధికారిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ సిబ్బంది బురదతో కప్పబడిన ఇళ్లు, వీధుల్లో గాలింపులు కొనసాగిస్తున్నారని మేయర్ శాంటియాగో గార్డెరాస్ చెప్పారు. సోమవారం రాత్రి కుండపోత వర్షం కారణంగా లా గాస్కా, లా కమునాలోని శ్రామిక వర్గ పరిసరాలకు సమీపంలో ఉన్న ఒక కొండగట్టులో నీరు పేరుకుపోయి, నివాసాలపై మట్టి, కొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపింది.
"ప్రస్తుతం, 22 మంది మరణించారు, 47 మంది గాయపడ్డారు, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది" అని గార్డెరాస్ విలేకరులతో అన్నారు. మరో "20 మంది తప్పిపోయినట్లు నివేదికలు ఉన్నాయి. వారి గాలింపు కొనసాగుతోంది" సోషల్ మీడియా వీడియోలు ఒక బురదతో కూడిన నది పొరుగు వీధుల గుండా ప్రవహిస్తున్నట్లు చూపించాయి. దానితో చెట్లు, వాహనాలు, చెత్తకుప్పలు మరియు విద్యుత్ స్తంభాలను కూడా తీసుకువెళుతున్నాయి. నివాసితులు సహాయం కోసం కేకలు వేయడం వినబడింది. ఇంకా కొండచరియలు విరిగిపడే అవకాశాలను అధికారులు తోసిపుచ్చడం లేదు. మేయర్ కార్యాలయం బాధిత కుటుంబాలకు షెల్టర్లను ఏర్పాటు చేసింది మరియు నగరంలోని వీధులను శుభ్రపరచడం ప్రారంభించింది. ఈక్వెడార్ అనేక ప్రాంతాలలో భారీ వర్షాలను ఎదుర్కొంటోంది, దీని వలన నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వందలాది గృహాలు, రహదారులను ప్రభావితం చేశాయి.