ట్రెండ్ కు తగ్గట్టుగా టీనేజర్ చేసిన ప్రయత్నం.. వెంటిలేటర్ పై ఉండగా నాలుగు సార్లు గుండెపోటు

DEADLY PIERCING Schoolgirl. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉంటుంది.. ముఖ్యంగా టీనేజర్లలో ట్రెండ్ కు తగ్గట్టుగా తాము

By Medi Samrat  Published on  11 July 2021 1:51 PM GMT
ట్రెండ్ కు తగ్గట్టుగా టీనేజర్ చేసిన ప్రయత్నం.. వెంటిలేటర్ పై ఉండగా నాలుగు సార్లు గుండెపోటు

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉంటుంది.. ముఖ్యంగా టీనేజర్లలో ట్రెండ్ కు తగ్గట్టుగా తాము కూడా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో పీర్సింగ్ కూడా ఒకటి..! కానీ ఫన్ కోసం తాము చేసుకోబోయే పని ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించలేదు. చిన్న ఇన్ఫెక్షన్ కాస్తా ప్రాణాలను తీయడమే కాకుండా.. కుటుంబానికి తీరని విషాదాన్ని నింపింది.

మినాస్‌ గెరాయిస్‌ స్టేట్‌లో ఎంగెన్‌హెయిర్‌ కాల్దాస్‌లో ఉంటోంది పదిహేనేళ్ల వయసున్న ఇసాబెల్లా ఎదువార్దా దె సౌసా కంటి భాగానికి రింగ్‌ కుట్టించుకోవాలనుకుంది. కుటుంబ సభ్యులెవరూ ఒప్పుకోలేదు.. ఆమెకు సహకరించలేదు. దీంతో స్నేహితురాలిని ఇంటికి పిలిపించుకుని ఆమె సాయంతో కంటికి పోగు కుట్టించుకుంది. అదే ఆమె చేసిన తప్పు..! ఇన్ఫెక్షన్ బారిన పడడంతో మూడు రోజుల తర్వాత ఇసాబెల్లా ముఖంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. కళ్లు పూర్తిగా మూసుకుపోవడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్‌ఫెక్షన్‌ తిరగబడడంతో ప్రాణాల మీదకు వచ్చింది. వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్న సమయంలో నాలుగుసార్లు గుండెపోటుకు గురై శుక్రవారం నాడు కన్నుమూసింది. ఆమె కనురెప్పలకు గుచ్చుకున్నది లోహపు వస్తువు కావడంతో ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారిందని వైద్యులు తెలిపారు.

ఆమె అత్త జుర్సీన్ డి సౌజా మాట్లాడుతూ "తాను చాలా అందమైన, ప్రత్యేకమైన మేనకోడలిని కోల్పోయిన ఒక అత్త నుండి వచ్చిన విజ్ఞప్తి. మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు మరియు మేనమామలు మరియు మీ కుటుంబ సభ్యుల మాటలకు కట్టుబడి ఉండండి." అని ఏడుస్తూ చెప్పుకొచ్చారు. ఇసాబెల్లా ప్రాణాలతో బయటపడి ఉంటే కుట్లు వేసి ఉండే వాళ్లమని ఆమె కంటి చూపు కోల్పోయి ఉండవచ్చని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేకమైన, లైసెన్స్ పొందిన క్లినిక్లలోని నిపుణుల సమక్షంలోనే ఇలాంటివి నిర్వహించాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


Next Story