ప్రధాని లక్ష్యంగా ఎయిర్‌పోర్టులో బాంబుదాడి.. 26 మంది మృతి

Deadly attack at Aden airport as new government arrives. ప్ర‌ధాన మంత్రి, మంత్రులు ల‌క్ష్యంగా అర‌బ్‌దేశ‌మైన యెమెన్ లోని

By Medi Samrat  Published on  31 Dec 2020 6:12 AM GMT
ప్రధాని లక్ష్యంగా ఎయిర్‌పోర్టులో బాంబుదాడి.. 26 మంది మృతి

ప్ర‌ధాన మంత్రి, మంత్రులు ల‌క్ష్యంగా అర‌బ్‌దేశ‌మైన యెమెన్ లోని విమానాశ్ర‌యంలో ఉగ్ర‌వాదులు.. ర‌న్ వే మీద ఉంచిన వాహ‌నంలో బాంబు పెట్టి పేల్చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 50 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో ప‌లువురు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు.

అయితే.. ఈ దాడి నుంచి దేశ ప్రధాని, మంత్రులు క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే స‌మ‌యంలో వారు చేరుకున్న ప్యాలెస్ స‌మీపంలో మ‌రో బాంబు పేలింద‌ని.. దీనిలో ప్రాణ‌న‌ష్టం జ‌రుగలేద‌ని యెయెన్ అధికారి ఒక‌రు తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి స్వాగతం పలకటం కోసం ఎయిర్ పోర్టులో అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్ తో పాటు మరో పది మంది మంత్రులతో కూడిన ప్రత్యేక విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది.

విమానంలో నుంచి వారంతా బయటకు వస్తున్న వేళలో.. అక్కడకు చేరుకున్న ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వాతావరణం ఉత్సాహభరితంగా ఉన్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రన్ వే మీద నిలిపి ఉంచిన వాహనం భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు అనంతరం ఎయిర్ పోర్టులో దట్టమైన పొగ కమ్ముకుంది. బాంబు పేలుడుకు సంబంధించిన వీడియో క్లిప్పులు అక్కడి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Next Story