మయన్మార్ లో 145 మంది ప్రాణాలు తీసిన తుఫాను

Cyclone Mocha death toll reaches 145 in Myanmar. మయన్మార్‌‌‌‌లో భీకర తుఫాను ‘మోకా’ దెబ్బకు 145 మందికి పైగా చనిపోయారు.

By Medi Samrat  Published on  20 May 2023 9:49 AM IST
మయన్మార్ లో 145 మంది ప్రాణాలు తీసిన తుఫాను

మయన్మార్‌‌‌‌లో భీకర తుఫాను ‘మోకా’ దెబ్బకు 145 మందికి పైగా చనిపోయారు. తుఫాను వల్ల ఎక్కువ నష్టం సంభవించిన రఖీనె రాష్ట్రంలో చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు సైనికులు, 24 మంది రఖీనె వాసులు, 117 మంది రోహింగ్యాలు ఉన్నారు. తుఫాను హెచ్చరికలు జారీ చేసినా.. ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లకపోవడంతోనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెబుతున్నారు తెలిపింది.400 మందికి పైగా చనిపోయినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని.. ప్రాణ, ఆస్తి నష్టం గురించిన స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవని ఆ దేశ మిలిటరీ అంటోంది.

మోకా తుఫాను ప్రభావం గత ఆదివారం మధ్యాహ్నం రఖీనెలోని సిట్వీ టౌన్‌‌షిప్‌‌లో మొదలైంది. గంటకు 209 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. జోరువానతో వరదలు పోటెత్తాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. సెల్‌‌ఫోన్‌‌ టవర్లు కూలిపోయాయి. దీంతో భారత్, జపాన్, ఇంగ్లండ్, అమెరికా తదితర దేశాలు మయన్మార్‌‌‌‌కు సాయం చేశాయి. సరుకులను సరఫరా చేశాయి.


Next Story