కొంత మంది చిన్న సాయం చేసి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ పెద్ద సాయం చేసి కూడా తన గురించి చెప్పొద్దని చెప్పేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అమెరికాలోని ఓ వ్యక్తి ఇందుకు నిదర్శనం. ఇటీవల రెస్టారెంట్‌కు వెళ్లిన అతను డిన్నర్ చేసిన అనంతరం రూ.4లక్షల టిప్‌ను ఇచ్చాడు. ఆ రెస్టారెంట్‌లో పనిచేసిన అందరిని సమానంగా పంచుకోమని చెప్పాడు. తన వివరాలు బయటకు వెళ్లడించవద్దని ఆ కస్టమర్ కోరాడు.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 12న ఓ కస్టమర్ ఒహియోలోని సౌక్ మెడిటేరియన్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. డిన్నర్ చేసిన అనంతరం బిల్ తెమ్మని చెప్పాడు. బిల్‌తో పాటు 5,600 డాలర్ల టిప్ ఇచ్చి అందరిని సమానంగా పంచుకోమని చెప్పాడు. 5600 డాలర్లు అంటే మన కరెన్సీలో 4,12,459 రూపాయిలు. కాగా ఆ రెస్టారెంట్‌లో మొత్తం 28 మంది పనిచేస్తున్నారు. వారు సమానంగా పంచుకుంటే.. ఒక్కొక్కరికి 200 డాలర్లు వచ్చాయి. క్రిస్మస్ పండుగ ముందు భారీ మొత్తంలో టిప్‌గా లభించడంతో.. ఆ రెస్టారెంట్ సిబ్బంది ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ కస్టమర్‌కు తమ ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ఇంత చేసినా ఆవ్యక్తి తన పేరును బయటకు చెప్పొద్దు అని కోరాడని సిబ్బంది వెల్లడించారు.