నీటిలో ఉన్నది బొమ్మ అనుకున్నాడు.. దగ్గరకు వెళితే చేతినే కోరికేసింది

Crocodile attacks tourist at amusement park. అమ్యూజ్మెంట్ పార్క్ లో ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వ్యక్తి.. చేతికి పెద్ద దెబ్బతో

By Medi Samrat  Published on  27 Nov 2021 6:52 PM IST
నీటిలో ఉన్నది బొమ్మ అనుకున్నాడు.. దగ్గరకు వెళితే చేతినే కోరికేసింది

అమ్యూజ్మెంట్ పార్క్ లో ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వ్యక్తి.. చేతికి పెద్ద దెబ్బతో ఆసుపత్రికి చేరాడు. అతడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొసలి దాడి చేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లోవైరల్ అవుతోంది. పార్క్ వద్ద భద్రతా చర్యలు, ప్రోటోకాల్‌ లు అసలు పాటించడం లేదని స్పష్టంగా అర్థం అయ్యింది. నెహెమియాస్ చిపడా అనే వ్యక్తి తన పుట్టినరోజున ఫోటోల కోసం కగాయన్ డి ఓరోలోని అమయా వ్యూ థీమ్ పార్క్‌లోని రెప్టైల్స్ ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు.

అతడు ఓ మొసలిని బొమ్మగా భావించాడు. కదలకుండా ఉండడంతో అది 'విగ్రహం' అనుకుని.. దగ్గరగా వెళ్లి దాని తలను ముట్టుకోవాల నిభావించాడు. అయితే అక్కడ 12 అడుగుల మొసలి విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని అసలు గుర్తించలేదు. అతడిని హెచ్చరించడానికి అక్కడ వ్యక్తులు ఎవరూ కూడా లేరు. దీంతో మొసలి తన బలమైన దవడలతో అతడిని గట్టిగా కరిచేసింది. అదృష్టవశాత్తూ అతడు త్వరగా నీటి నుండి బయటకు రాగలిగాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎడమ చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఆ వ్యక్తి భయంతో కేకలు వేస్తూ ముసలి దగ్గర నుంచి వెళ్లిపోతున్నట్లు వీడియోలో ఉంది. అతని కుడి చేతికి కూడా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది అతనికి సహాయం చేస్తుండగా.. అతను నొప్పితో విలపించాడు. అతని కుమార్తె మెర్సీ జాయ్ చిపాడ మాట్లాడుతూ ఉత్తర మిండనావో మెడికల్ సెంటర్‌లో ఎడమ చేతికి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్నారని చెప్పారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించే ముందు అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోని నర్సు ప్రథమ చికిత్స చేసిందని ఆమె తెలిపారు.


Next Story