జర్మనీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Corona cases at record levels in Germany. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. చైనా, రష్యా, జర్మనీతో పాటు పలు దేశాల్లో కరోనా కోరలు చాస్తోంది.

By అంజి  Published on  11 Nov 2021 7:50 PM IST
జర్మనీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. చైనా, రష్యా, జర్మనీతో పాటు పలు దేశాల్లో కరోనా కోరలు చాస్తోంది. జర్మనీ దేశంలో కరోనా వైరస్‌ వేగంగా రికార్డు స్థాయిలో వ్యాప్తిస్తోంది. జర్మనీలో కొత్తగా 50,196 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. జర్మనీలో కరోనా వైరస్‌ వ్యాపించినప్పటి నుండి మొదటి సారిగా 50 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత నెల నుండి జర్మనీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌ మాట్లాడుతూ.. కరోనా కేసులు అనూహ్యరీతిలో వెలుగు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త పద్ధతిలో మహమ్మారి కరోనా తిరిగొస్తోందని.. వెంటనే వైరస్‌ నియంత్రణకు కట్టడి చర్యలు చేపట్టాలని మెర్కెల్‌ అధికార ప్రతినిధి అన్నారు. ఈ పరిస్థితికి ఒక రకంగా వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండటమే అని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జర్మనీలో 67 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అర్హులంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారిలోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. బార్లు, రెస్టారెంట్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లోకి వ్యాక్సిన్‌ తీసుకోని వారిని అనుమతించకుండా నిషేధం విధించింది. కేసులు పెరుగుతుండడంతో హాస్పిటళ్లపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఇతర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Next Story