ప్రభుత్వం కీలక ఆదేశాలు.. దంపతులు కలిసి పడుకోవద్దు.. ముద్దులు, హాగ్‌లకు నో ఛాన్స్
Control Your Desire Shanghai Asks Residents Not to Hug as City Battles COVID.కరోనా మహమ్మారి ప్రపంచాన్ని
By తోట వంశీ కుమార్ Published on 7 April 2022 12:11 PM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మనదేశంలో ప్రస్తుతం ఈ మహమ్మారి అదుపులో ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం ఇంకా ఈ వైరస్ విజృంభిస్తోంది. ఇక ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనేది అందరికి తెలిసిందే. ప్రస్తుతం చైనా దేశంలోని షాంగై పట్టణవాసులు ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకోగా ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్ ను విధించింది. కనీస సౌకర్యాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలను తామే సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అవి తమకు అందడం లేదని పలువురు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. డ్రోన్ల ద్వారా అక్కడి వీధుల్లోని పరిస్థితులను ఎప్పటి కప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎవ్వరు ఇళ్లలోంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఇక బుధవారం రాత్రి నుంచి దంపతులు కూడా కలిపి పడుకోవద్దని, వేర్వేరుగా పడుకోవాలని, ముద్దులు, కౌగిలింతలు వంటివి వద్దని, భోజనం కూడా విడి విడిగా తినాలనే ప్రకటనను ఆరోగ్య కార్యకర్తలు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రస్తుతం ఈ నిబంధనలు తప్పక పాటించాలని కోరింది. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను ఓ నెటీజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
This is more funny. "From tonight, couple should sleep separately, don't kiss, hug is not allowed, and eat separately. Thank you for your corporation! " pic.twitter.com/ekDwLItm7x
— Wei Ren (@WR1111F) April 6, 2022
షాంఘై నగరంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా 26 మిలియన్ల మంది ప్రజలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయారు. అక్కడి ప్రజల్లో ఆహార కొరత ఉండటంతో దాని గురించి తగు చర్యలు తీసుకుంటామని షాంఘై వైస్ మేయర్ చెన్ తాంగ్ చెబుతున్నారు. 'షాంఘైలో బియ్యం, మాంసం వంటి సరిపడ వనరులు ఉన్నాయి. కాకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడమే సమస్యగా మారింది. మహమ్మారి నియంత్రణలో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం' అని చెప్పారు. త్వరలోనే హోల్‌సేల్ మార్కెట్లు, ఫుడ్ స్టోర్లు రీఓపెన్ చేస్తాం. లాక్‌డౌన్ ఏరియాల్లో పర్సనల్ గా డెలివరీ చేస్తామన్నారు.