స్పృహ తప్పి పడిపోయిన బస్సు డ్రైవర్‌.. 66 మంది ప్రాణాల‌ను కాపాడిన 7వ తరగతి విద్యార్థి

Class 7 Student In US Jumps Into Action To Save Others As Bus Driver Falls Unconscious. 7వ తరగతి విద్యార్థి బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్కూల్ బస్సును నియంత్రించాడు.

By Medi Samrat  Published on  28 April 2023 8:00 PM IST
స్పృహ తప్పి పడిపోయిన బస్సు డ్రైవర్‌.. 66 మంది ప్రాణాల‌ను కాపాడిన 7వ తరగతి విద్యార్థి

Class 7 Student In US Jumps Into Action To Save Others As Bus Driver Falls Unconscious


7వ తరగతి విద్యార్థి బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్కూల్ బస్సును నియంత్రించాడు. అతడు ఎంతో ధైర్యంగా చేసిన ఈ పని ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. ఈ ఘటన బుధవారం మిచిగాన్‌లో చోటుచేసుకుంది. వారెన్ కన్సాలిడేటెడ్ స్కూల్స్ విడుదల చేసిన వీడియోలో బస్సు నడుపుతున్నప్పుడు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. విద్యార్థి డిల్లాన్ రీవ్స్ స్టీరింగ్ వీల్‌ను పట్టుకోవడం చూపిస్తుంది.


మిచిగాన్​లోని వారెన్​ కన్సాలిడేటెడ్​ స్కూల్ కి చెందిన బస్సు నడుపుతున్నప్పుడు డ్రైవర్​ అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అది గమనించిన 7 వ తరగతి విద్యార్థి డిల్లాన్​ రీవ్స్​ అప్రమత్తమయి, బస్సు అదుపు తప్పకుండా స్టీరింగ్​ ని పట్టుకున్నాడు. అనంతరం బస్సును సురక్షితంగా ఆపాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్​ను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో బస్సులో దాదాపు 66 మంది విద్యార్థులు ఉన్నారు.


Next Story