బోండి బీచ్‌లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే..!

సిడ్నీలోని ప్రఖ్యాత బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 15 మంది మృతి చెందారు.

By -  Medi Samrat
Published on : 25 Dec 2025 8:20 PM IST

బోండి బీచ్‌లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే..!

సిడ్నీలోని ప్రఖ్యాత బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 15 మంది మృతి చెందారు. ప్రతీ ఏడాది ఎంతో సందడిగా ఈ సీజన్ లో ఉండేది. ఈసారి మాత్రం క్రిస్మస్ వేడుకలు చాలా నిశ్శబ్దంగా జరిగాయి. దాదాపు మూడు దశాబ్దాలలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల ఘటన నుండి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. సాంప్రదాయ క్రిస్మస్ గమ్యస్థానమైన బోండిలోని బీచ్‌ఫ్రంట్‌లో పోలీసులు గస్తీగా తిరిగారు. వందలాది మంది ప్రజలు శాంటా టోపీలు ధరించి ఇసుకపై కూర్చున్నారు.

డిసెంబర్ 14న యూదుల హనుకా వేడుకలో జరిగిన తుపాకీ దాడి తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన ఆంక్షలను తీసుకొచ్చింది. కఠినమైన తుపాకీ చట్టాలు, యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. కొత్త చట్టాల ప్రకారం సిడ్నీలో బహిరంగ సభ నియమాలను కఠినతరం చేశారు.

Next Story