అంతరిక్షంలో ముక్కలుగా విరిగిపోయిన చైనా లాంగ్‌మార్చ్-5బీ రాకెట్‌కు సంబంధించిన శకలాలు ఎవరికీ ఎటువంటి హాని కనిగించలేదు. అవి ఫిలిప్పీన్స్‌లోని సముద్రంలో పడిపోయాయని చైనా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఉదయం 12.55 గంటలకు శకలాలు భూకక్ష‍్యలోకి ప్రవేశించిన అనంతరం కాలిపోయాయని చైనా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. 119 డిగ్రీల తూర్పు రేఖాంశం, 9.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఈ శకకాలు పడ్డాయని తెలిపింది. ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ప్రావిన్స్‌లోని ప్యూర్టో ప్రిన్సెసాలోని సముద్రంలో ఆ శకలాలు పడ్డాయి.
లాంగ్‌మార్చ్-5బీ రాకెట్‌ను చైనా ఈ నెల 24న ప్రయోగించింది. ఆ శకలాలు భూమి వైపునకు వేగంగా దూసుకు రావడంతో ప్రజల్లోనూ, శాస్త్రవేత్తల్లోనూ టెన్షన్ మొదలైంది. ఆ శకాల దిశను మార్చేందుకు కూడా సాధ్యపడలేదు. వాటి శకలాలు భూకక్ష‍్యలోకి ప్రవేశించడంతో ఆందోళన మరింత పెరిగింది. గత రాత్రి హిందూ మహాసముద్రంపై భూవాతావరణంలోకి చైనా రాకెట్ శకలాలు ప్రవేశించాయని అమెరికా కూడా నిర్ధారించింది. అవి ఇవాళ ఫిలిప్పీన్స్‌లోని సముద్రంలో పడిపోయాయని చైనా ప్రకటన చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.