చంద్రుడిపై వింత వస్తువు అంటున్న చైనా
Chinese Rover Spots Cube-Shaped "Mystery House" On Moon. చైనాకు చెందిన 'యుటు-2 మూన్ రోవర్' చంద్రుడి ఉపరితలంపై వింతగా
By Medi Samrat Published on 6 Dec 2021 4:06 PM ISTచైనాకు చెందిన 'యుటు-2 మూన్ రోవర్' చంద్రుడి ఉపరితలంపై వింతగా కనిపించే, క్యూబ్ ఆకారంలో ఉన్న వస్తువును గుర్తించినట్లు చెబుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. గత వారం చైనా అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ఫొటోల్లో ఈ వస్తువు కనిపించింది. Space.com ప్రకారం, రోవర్ ఆ వస్తువును చంద్రునికి అవతలి వైపున ఉన్న వాన్ కర్మన్ బిలం గుండా వెళుతున్నప్పుడు గుర్తించింది. యుటు-2 రోవర్ చంద్రునిపైకి చైనీస్ చాంగ్ 4 మిషన్‌లో భాగంగా వెళ్ళింది. ఇది 2019 నుండి చంద్రుని అవతలి వైపు అన్వేషిస్తోంది. Space.com యొక్క జర్నలిస్ట్ ఆండ్రూ జోన్స్ శుక్రవారం షేర్ చేసిన వరుస ట్వీట్లలో అసాధారణ దృశ్యాన్ని హైలైట్ చేశారు.
"ఉత్తర హోరిజోన్‌లో క్యూబిక్ ఆకారం యొక్క చిత్రం - వాన్ కర్మన్ క్రేటర్‌లోని రోవర్ నుండి 80మీ దూరంలో ఉంది" అని రాశారు. "ఇది ఒబెలిస్క్ లేదా గ్రహాంతరవాసులు కాదు, కానీ ఖచ్చితంగా తనిఖీ చేయవలసిన విషయం" అని తదుపరి ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. ఆ వస్తువుకు "మిస్టరీ హౌస్" అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు దానిపై మెరుగైన సమాచారాన్ని పొందడానికి రోవర్‌ను దానికి దగ్గరగా నడిపే అవకాశం ఉంది. ఈ విషయం ట్విట్టర్‌లో సంచలనం సృష్టించినప్పటికీ, అది ఒక బండరాయి అని చెబుతున్నారు. 2019లో కూడా యుటు-2 చంద్రునిపై "ఆకుపచ్చ-రంగు జెల్ లాంటి పదార్ధాన్ని" కనుగొందనే వార్తలు వచ్చాయి.