పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చిన చైనా
China Shock To Pakistan. చైనా తమకు అండగా ఉందని పాకిస్తాన్ గత కొద్ది సంవత్సరాలుగా చెబుతూ వస్తోంది. పాక్ కు చైనా వరుసగా
By Medi Samrat Published on 3 Jun 2021 2:11 PM ISTచైనా తమకు అండగా ఉందని పాకిస్తాన్ గత కొద్ది సంవత్సరాలుగా చెబుతూ వస్తోంది. పాక్ కు చైనా వరుసగా అప్పులు ఇస్తూనే వస్తోంది. ఇక ఎన్నో ప్రాజెక్టులు చైనాను నమ్ముకొని పాకిస్తాన్ మొదలుపెట్టేసింది. చైనా పాకిస్తాన్ నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ ఇప్పుడు పాకిస్థాన్ కు పెను భారంగా మారిపోయింది దీనిపై తీసుకున్న రుణాలు పాకిస్తాన్ చెల్లించకపోతే చైనా లీజు కింద ఆయా ప్రాంతాలను లాగేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
అందుకే పాకిస్తాన్ తమ రుణాలను మాఫీ చేయాలని చైనాను కోరుతోంది. అయితే అదను చూసుకుని ఉన్న చైనా.. పాకిస్తాన్‌కు రూ.22 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడానికి నిరాకరించింది. ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్‌కు చైనా రుణ మాఫీ చేయమని చెప్పడంతో పెద్ద షాక్ తగిలింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇచ్చిన 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 వేల కోట్లు) రుణాన్ని మాఫీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చైనాను అభ్యర్థించగా.. పాకిస్తాన్ విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. దీంతో చైనా ఇచ్చిన అప్పులను ఎలా తీర్చాలన్న సందిగ్ధంలో పాకిస్తాన్ పడిపోయింది. ఇచ్చిన రుణాల నిబంధనలు, ఇతర అంశాలపై మరోసారి చర్చించడం కుదరదని చైనా సైడ్ అయిపోయింది. పాక్ ఈ రుణాలకు సంబంధించి విముక్తి పొందాలంటే చైనా బ్యాంకుల నిబంధనలను సవరించాల్సి వస్తుంది. చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా. రుణాల నిబంధనల్లో ఎలాంటి మార్పుల గురించి చర్చించేందుకు సిద్ధంగా లేవని వెల్లడించింది.
పాకిస్తాన్ డిసెంబర్ వరకు దాదాపు 4 29,400 మిలియన్ డాలర్ల రుణాలు పొందింది. పాకిస్తాన్ జీడీపీలో 109 శాతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2023 చివరి నాటికి ఈ నిష్పత్తి 220 శాతం వరకు చేరొచ్చు. దీంతో పాక్ మరింత అప్పుల్లో కూరుకుపోయే అవకాశం ఉంది.